చంద్రబాబు-పవన్ పై సజ్జల తీవ్ర విమర్శలు-పథకాలపై టన్నుల కొద్దీ విషం చిమ్ముతున్నారంటూ..
ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇసుక అక్రమాల పేరుతో విపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో రహస్య పొత్తులు పెట్టుకున్నారంటూ టీడీపీపై సజ్జల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలుపై విపక్షాల విమర్శల్ని ఆయన తప్పుబట్టారు.
ఏపీలో వివక్షకు తావులేకుండా సాచ్యురేషన్ విధానంలో పధకాలు అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పధకాలు అందిస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. అయినా విపక్షాలు పథకాలపై విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. జగన్ పాలనపై టన్నుల కొద్దీ విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీల కార్యకర్తల కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందించామని సజ్జల గుర్తుచేశారు..

చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, ఉచిత ఇసుక అయితే హరిత ట్రైబ్యునల్ 100 కోట్లు జరిమానా ఎందుకు విధించిందని సజ్జల ప్రశ్నించారు. ఇసుక విషయంలో రోజుకో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రంలో రహస్య పొత్తులు పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును సజ్జల విమర్శించారు. టీడీపీ నేతలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్నారు.
సామాజిక సాధికార యాత్ర ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీలు చూపించి చెడు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న మేలు ప్రజలకు అర్దమవుతుందన్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లి ఏం చేశాడని సజ్జల ప్రశ్నించారు.లోకేష్ చేసింది ఏంటో చూపించకుండా బూతులు మాట్లాడుతున్నాడన్నారు. లోకేష్ వస్తే ఒక జోకర్ వచ్చాడని ఆనందం ప్రజల్లో ఉంటుందన్నారు. చంద్రబాబు కు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారా అని సజ్జల ప్రశ్నించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లకు గృహసారధులు వెళ్లారన్నారు.












Click it and Unblock the Notifications