"ఆర్గనైజ్డ్ సంకర తెగ"..సజ్జల మరో వివాదం..! లోకేష్ కౌంటర్..!
ఏపీలో అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసిన వివాదం చినికి చినికి గాలి వానగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సాక్షి టీవీలో డిబేట్ నడిపిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా ఆఫీసులపై తెలుగు మహిళలు, అమరావతి మహిళలుగా చెప్పుకుంటున్న కొందరు దాడులకు దిగుతున్నారు. వీటిపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు.
సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడ ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. కొమ్మినేని అరెస్టును ఖండించారు.

సాక్షిలో కొమ్మినేని నిర్వహిస్తున్న డిబేట్ లో కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ అమరావతి చుట్టపక్కల ప్రాంతాల్లో వేశ్యల సంఖ్య ఎక్కువగా ఉందని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి టీడీపీ ప్రచారం చేయడం ప్రారంభించిందని సజ్జల ఆరోపించారు. టీడీపీ వెబ్ సైట్లో మొదలుపెట్టిన ఈ ప్రచారాన్ని చంద్రబాబు కృష్ణంరాజు వీడియోను ట్వీట్ చేసి మరింత రెచ్చగొట్టారన్నారు. ఆ తర్వాత కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. ఆ తర్వాత సాక్షి పేపర్, టీవీల్లో ఎక్కడా దీనిపై ప్రస్తావన లేదన్నారు.

ఆ తర్వాత సాక్షి టీవీ కూడా తమకు సంబంధ లేదని దీనిపై వివరణ ఇచ్చిందన్నారు. అయినా కృత్రిమంగా ఆర్గనైజెడ్ ఆందోళనలు మొదలుపెట్టారని సజ్జల ఆరోపించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జనాన్ని పోగేసి ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ సంకర తెగ వారే ఆర్డనైజ్డ్ గా ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
#YCPinsultsWomen
— Lokesh Nara (@naralokesh) June 9, 2025
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని… pic.twitter.com/sY0uvkq0Bu
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష అని ప్రశ్నించారు. ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారని, ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారని ఆక్షేపించారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామన్నారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!!












Click it and Unblock the Notifications