వైసీపీ మార్పులపై ప్లీనరీలోనే -బీజేపీకి మద్దతివ్వలేదు-వెంకయ్యపై టీడీపీ షాక్-సజ్జల కామెంట్స్
ఏపీలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్.. పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 7,8 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఈ ప్లీనరీ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వందశాతం హామీల్ని పూర్తి చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై బిజీగా ఉన్న ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. వైసీపీలో సంస్ధాగత మార్పులపై ప్లీనరీలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్లీనరీలో వైసీపీ ప్రకటించే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే తాజాగా వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతుపై దాపరికాలేమీ లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. బీజేపీ, వైసీపీ సిద్ధాంతాలు వేర్వేరన్నారు. అలాగే బీజీపీ పెట్టిన ఏ బిల్లుకీ మద్దతివ్వలేదని సజ్జల చెప్పుకొచ్చారు. మరోవైపు వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి అంశంపైనా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకు రాష్ట్రపతి పదవి రాకపోడంతో టీడీపీ షాక్ కు గురైందన్నారు.
అందుకే టీడీపీ నేతలు నోరెత్తడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications