చంద్రబాబుకు 'సాక్షి' షాక్: హైద్రాబాద్‌లో రోడ్డెక్కారు (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆ మీడియా జర్నలిస్టులు బుధవారం నాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వారు గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పాత్రికేయులు.. మీడియా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. తెలుగువారి మనస్సాక్షి సాక్షి అని, దానిని ఆంక్షలు సిగ్గుచేటు అని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు, సాక్షి ప్రసారాల నిలుపుదలపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
కాగా, సాక్షి నిలుపుదల నేపథ్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నిలుపుదల అంశం కూడా చర్చకు వస్తోంది. నిన్న ఏబీఎన్, నేడు సాక్షి నిలుపుదల సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏబీఎన్ నిలుపుదలకు, సాక్షి నిలుపుదలకు వేర్వేరు కారణాలు ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.

వినతి పత్రం
సాక్షి మీడియా జర్నలిస్టులు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీలో సాక్షి టీవి ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.

వినతి పత్రం
సాక్షి మీడియా జర్నలిస్టులు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీలో సాక్షి టీవి ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం పైన సంతకాల దృశ్యం.

వినతి పత్రం
సాక్షి మీడియా జర్నలిస్టులు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీలో సాక్షి టీవి ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం పైన సంతకాల దృశ్యం.

ర్యాలీ
సాక్షి మీడియా పైన ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష కట్టి, ప్రసారాలను నిలుపుదల చేసిందని, ఇది సరైన చర్య కాదని చెబుతూ హైదరాబాదులో ర్యాలీ తీస్తున్న జర్నలిస్టులు

ర్యాలీ
'మీడియా కళ్లకు గంతలు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు', 'మీడియాకు సంకెళ్లా, మీడియా స్వేచ్ఛను కాపాడండి', 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు, కుట్రలతో ప్రజల మనసులో నుంచి సాక్షిని చెరపలేరు', 'కుట్రలతో సాక్షిని చంపలేరు' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

వినతిపత్రం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వారు గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందించారు.

ర్యాలీ
సాక్షి మీడియా పైన ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష కట్టి, ప్రసారాలను నిలుపుదల చేసిందని, ఇది సరైన చర్య కాదని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్.












Click it and Unblock the Notifications