Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీలో అధికారంలోకి, 'సాక్షి' మీడియా కోసం: అమిత్ షా, చురకలు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, తెలంగాణలో 35 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పర్యటిస్తున్నారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. ఉదయం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నరేంద్ర మోడీ వచ్చాక ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఈ ఏడు నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా పని చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు.

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మోడీ చర్యలు చేపట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు.ప్రధాననమంత్రి జన్‌ధన్‌ యోజన గొప్ప పథకమన్నారు. ఇప్పటి దాకా 10కోట్ల ఖాతాలు తెరిచారన్నారు.

 అమిత్ షా

అమిత్ షా

మేక్‌ ఇన్‌ ఇండియా, సిల్క్ డెవలప్‌మెంట్‌కు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. రైతులకు మద్దతు ధరే తమ లక్ష్యమన్నారు. బ్లాకమనీని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సిట్‌ కసరత్తు చేస్తోందని, నెలరోజుల్లో నల్లధనం లిస్టును సుప్రీంకు ఇచ్చామన్నారు. యూపీఏ చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు.

అమిత్ షా

అమిత్ షా

గుజరాత్‌‌లా తెలంగాణ, జార్ఖండ్‌ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా షా స్పందించారు. అలాంటి మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అలా మాట్లాడిన నష్టమే అన్నారు. సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ సమర్థించదన్నారు.

 అమిత్ షా

అమిత్ షా

ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. అలాంటి వ్యాఖ్యల ప్రభావం తమ అభివృద్ధి అజెండా పైన పడదన్నారు. సాక్షి మహారాజ్ మీడియా కోసం ప్రకటనలు చేస్తుంటాడని చతుర్లు వేశారు.

 అమిత్ షా

అమిత్ షా

మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. బలవంతపు మతమార్పిళ్లు సరికాదన్నారు. బలవంతపు మతమార్పిడుల నివారణకు అందరు సహకరించాలని కోరారు.

 అమిత్ షా

అమిత్ షా

ఒక్క సోకాల్డ్ సెక్యులర్ పార్టీ కూడా ఇందుకు మద్దతు పలకడం లేదని విమర్శించారు. మీడియాలో విస్తృత చర్చ ద్వారా బలవంతపు మతమార్పిళ్లు ఆపగలమా, దేశాన్ని మీడియా నడిపిస్తోందా లేక చట్టమా, చట్టమే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు.. గట్టి చట్టం తీసుకు రావాలన్నారు. భూసేకరణ కోసం ఆర్డినెన్స్ తేవడంలో తప్పులేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+