వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అమెరికా డాక్టరేట్ ఉత్తదేనా: దుమ్మురేపిన సాక్షి మీడియా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకునే స్థితిలో లేరని సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. బాబు బడాయి డాక్టరేట్ శీర్షికతో ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని ముందుకు వచ్చిన అమెరికాలోని విశ్వవిద్యాలయం పరిస్థితే ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని ఆ వార్తాకథనం సారాంశం.

సాక్షి మీడియా కథనం ప్రకారం - ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలూ నిధుల సమస్య నేపథ్యంలో ఆ విశ్వవిద్యాలయం మూసివేత దిశగా పయనిస్తోంది. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల చికాగో స్టేట్ యూనివర్శించి చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గత డిసెంబర్‌లో ఆ యూనివర్శిటీ ప్రతినిధులు విజయవాడకు వచ్చి ఆ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబును కలిసి తామిచ్చే గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించాలని కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.

Sakshi media on honorary doctorate to Chandrababu

అయితే, ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని చెప్పిన విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ఆఫ్ చికాగో కాదని, చికాగో స్టేట్ యూనివర్శిటీ అనే విషయం వెలుగు చూసింది. ఆ యూనివర్శిటీ యేటా గుర్తింపు కోసం నానా తంటాలు పడుతోందని, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందని సాక్షి మీడియా రాసింది.

సాక్షి మీడియా ఇంకా ఇలా రాసింది - అరకొర నిధులతో 2016 మార్చి నాటికి ఏదో రకంగా స్ప్రింగ్ సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ ప్రకటించింది. నిధుల కోసం లామేకర్స్ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు యూనివర్శిటీ ప్రెసిడెంట్ థామస్ జె.కల్హన్ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్థితిలో ఆ యూనివర్శిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే.

English summary
According to Sakshi media - Andhra Pradesh CM Nara Chandrababu Naidu is not in a position to receive honorary doctorate from US University
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X