వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు జగన్ మీడియా సూటి ప్రశ్న: టీడీపీ వెబ్‌సైట్‌లో ఆ పోస్టుల సంగతేంటి!

టీడీపీ అధికార వెబ్ సైట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ను కించపరిచేలా విచ్చలవిడిగా పెట్టిన పోస్టుల సంగతేంటి? అని జగన్ మీడియా ప్రశ్నిస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఇన్నాళ్లు మీడియాను మేనేజ్ చేస్తే చాలనుకునే పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాపై సైతం విపరీతంగా ఫోకస్ చేస్తున్నాయి. అనుకూల మీడియాల్లో వారి భజనలు తారాస్థాయికి చేరుతుంటే.. సోషల్ మీడియా మాత్రం ఆయా పార్టీల, ప్రభుత్వాల డొక్క చించి డోలు కడుతోంది.

సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు, అలా రాయొచ్చా:బాబుసోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు, అలా రాయొచ్చా:బాబు

దీంతో సోషల్ మీడియాలోను ఆయా పార్టీలు రహస్య ఏజెంట్లను నియమించుకున్నాయి. ఎవరు తమకు అనుకూలం? ఎవరు ప్రతికూలం? అన్న అంశాలపై ఫోకస్ చేస్తూ.. వ్యతిరేక ప్రచారానికి పాల్పడినవారిని టార్గెట్ చేసే పనిని ముందేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ పంచ్ అనే వెబ్ సైట్ లో కార్టూనిస్టుగా చేస్తున్న రవికిరణ్ అరెస్టు జరిగింది.

ఉద్దేశపూర్వకమేనా?:

ఉద్దేశపూర్వకమేనా?:

సోషల్ మీడియాను నియంత్రిస్తానంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం.. కచ్చితంగా ఇది ప్రభుత్వ చర్యేనన్న అనుమానం కలిగించేలా చేసింది. దానికి తోడు పోలీసులు సైతం వైసీపీతో లింకు పెట్టి ప్రశ్నలు అడగడం, రవికిరణ్ వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ఆరోపణలు వస్తుండటంతో.. మొత్తం మీద ఈ వివాదం టీడీపీ-వైసీపీ మధ్య ఫైట్ గా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.

సాక్షి సంధించిన ప్రశ్న:

సాక్షి సంధించిన ప్రశ్న:

చంద్రబాబు సర్కారే ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష అనుకూల మీడియా 'సాక్షి' తాజాగా ప్రభుత్వానికి ఓ ప్రశ్న సంధించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ రవికిరణ్ ను అరెస్టు చేశారు సరే.. మరి టీడీపీ అధికారిక వెబ్ సైట్ మాటేంటి? అని ప్రతిపక్ష మీడియా ప్రశ్నిస్తోంది.

టీడీపీ వెబ్‌సైట్‌లో కేసీఆర్, జగన్‌లపై:

టీడీపీ వెబ్‌సైట్‌లో కేసీఆర్, జగన్‌లపై:

టీడీపీ అధికార వెబ్ సైట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ను కించపరిచేలా విచ్చలవిడిగా పెట్టిన పోస్టుల సంగతేంటి? అని ప్రశ్నిస్తోంది. ఇందుకు ఎవరు బాధ్యులు.. ఎవర్ని అరెస్టు చేయాలి? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించింది.

భిన్నాభిప్రాయాలు:

భిన్నాభిప్రాయాలు:

కాగా, రవికిరణ్ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వెలువడిన సంగతి తెలిసిందే. పలువురు సోషల్ మీడియాలో ప్రభుత్వ జోక్యాన్ని తప్పుపట్టగా.. మరికొందరు ఇది వైసీపీ చేయిస్తోన్న పెయిడ్ యాక్టివిజం అంటూ ఆరోపణలు చేశారు. ఏదేమైనా టీడీపీ-వైసీపీ మధ్య ఇదో కొత్త పోరుకు దారి తీసింది. మున్ముందు ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

English summary
Ysrcp President Jagan's Media questioned AP Cm chandrababu Naidu on their party official website. In that website there are lot of satires on Telangana CM KCR and Ysrcp President Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X