జగన్‌కు షాక్: హాయ్‌ల్యాండ్‌పై ట్విస్ట్, దానిని లోకేష్ ఎలా కొట్టేయగలరు?
విజయవాడ: గుంటూరు సమీపంలోని రూ.425 కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను టిడిపి యువనేత నారా లోకేష్ కొట్టేశారని ఓ పత్రికలో వచ్చిన వార్తలను ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ఖండించింది. దీనిని శుక్రవారం నాడు సిబిఐ కూడా ఖండించడం కొత్త ట్విస్ట్.
రాజధానిలో టిడిపి నేతల భూదందా అంటూ సాక్షి పత్రికలో కథనాలు, వైసిపి నేతల విమర్శలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హాయ్‌ల్యాండ్ రిసార్ట్ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
లక్షలాది మంది మధ్య తరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌కు చెందిన ఈ రిసార్ట్‌ను లోకేశ్ లాగేసుకున్నారన్న వైసిపి నేతలు ఆరోపించారు. దీనిని టిడిపి నేతలు మొదటి నుంచి తిప్పుకొడుతున్నారు. తాజాగా దీనిపై అగ్రిగోల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు మీడియా ముందుకు వచ్చారు.
అగ్రిగోల్డ్‌కు చెందిన సదరు రిసార్టును ప్రభుత్వానికి అటాచ్ చేశామని సిఐడి చెప్పింది. దానిని త్వరలోనే వేలం వేయనున్నామని తెలిపింది. రిసార్టును వేలం వేయగా వచ్చిన డబ్బును హైకోర్టు ద్వారా డిపాజిటర్లకు పంచుతామని సిఐడి వెల్లడించింది.

అంతకుముందు గురువారం రాత్రి ప్రభుత్వం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన అన్ని ఆస్తులతో పాటు హాయ్‌ల్యాండ్‌ను కూడా జప్తుచేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 20వ తేదీన జీవో 23 విడుదల చేసినట్లు గుర్తు చేసింది. ఆ జీవో ప్రతిని మీడియాకు అందించింది.
అగ్రిగోల్డ్‌కు సంస్థకు సంబంధించి జప్తు చేసిన మొత్తం 16,857 ఎకరాల్లో గుంటూరు జిల్లాలోని 103 ఎకరాలు ఉందని పేర్కొంది. అందులో చినకాకానిలోని 85 ఎకరాల హాయ్‌ల్యాండ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇవి కాకుండా కర్నూలులో 1,285, అనంతపురంలో 1,633, కడపలో 883, చిత్తూరులో 3,312, ప్రకాశంలో 6,339, కృష్ణాలో 2,037, పశ్చిమ గోదావరిలో 9, విశాఖపట్నంలో 485, విజయనగరంలో 112, శ్రీకాకుళంలో 46 ఎకరాలు అటాచ్ చేసినట్లు వెల్లడించింది.
అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులపై యాజమాన్య హక్కులు అగ్రిగోల్డ్ కంపెనీకే ఉంటాయని పేర్కొంది. ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవని, రిజిస్ట్రేషన్ జరగదని స్పష్టం చేసింది. ఒకవేళ జరిగినా అది చెల్లదని పేర్కొంది. అలాంటిది హాయ్‌ల్యాండ్ లోకేష్ వశమైనట్లు తప్పుడు రాతలు రాయడం దారుణమని పేర్కొంది.












Click it and Unblock the Notifications