ఏపీ ప్రభుత్వం తీపి కబురు: భారీగా పెరిగిన ప్రజాప్రతినిధుల జీతాలు

విజయవాడ: ఏపీలో స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్పీ ఛైర్మన్ నుంచి గ్రామ సర్పంచుల వరకు ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ మేరకు జెడ్పీ చైర్మన్లకు ప్రస్తుతం ఉన్న రూ. 6 వేల నుంచి రూ. 40 వేలకు పెంచారు. అదే విధంగా జెడ్పీటీసీలకు రూ. 2,500 నుంచి రూ. 6 వేలకు పెంచారు. ఎంపీపీలకు రూ. 1500 నుంచి రూ. 6 వేలకు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ. 3 వేలు, సర్పంచ్‌లకు రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Salary hike for local body presidents in Andhra Pradesh

వీఆర్వోపై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

వీఅర్వోపై దాడి చేసి విధులకు ఆటంకపరిచినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రేపల్లె సినీయర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో వీఆర్వో వర ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన వెంకట రమణారావు అలియాస్ బుల్లిబాబు కత్తితో దాడి చేశాడు.

దీంతో బాధిత వీఅర్వో కోర్టుని ఆశ్రయించాడు. విచారణ అనంతరం రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి చక్రపాణి సోమవారం తీర్పు వెల్లడించారు. మద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+