ఎన్టీఓ ముసుగులో చిన్న పిల్లల విక్రయం: రూ. 5 లక్షలకే అబ్బాయి
అమరావతి: స్వచ్చంధ సేవా సంస్ధ ముసుగులో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరిలోని ఏలూరు పట్టణ రూరల్ మండలం వెంకటాపురంలో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఓ స్వచ్చంధ సంస్ధను నిర్వహిస్తున్నారు. ఈ సంస్ధ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

దీంతో ఏలూరు పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. స్వచ్చంధ సంస్ధ పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తంబీ, గుట్టుచప్పుడు కాకుండా పసిపిల్లలను విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు.
ముక్కుపచ్చలారని మగ పిల్లాడి ధరను రూ. 5 లక్షలుగా నిర్ణయించిన అతడు, ఆడపిల్లలను రూ. 3 లక్షలకే విక్రయిస్తున్నాడు. పిల్లలను విక్రయిస్తున్న తంబీని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications