మ‌న్యం వీరుడు అల్లూరి ఉద్య‌మ స్ఫూర్తికి.. లాల్ స‌లామ్‌!

భార‌త స్వాతంత్య్రోద్య‌మంలో అసువులుబాసిన‌ విప్ల‌వ వీరుల్లో అల్లూరి సీతారామ‌రాలు పేరు చిర‌స్మ‌ర‌నీయం. పోరాటానికి మారుపేరుగా.. విప్ల‌వానికి చిరునామా నిలిచిన అల్లూరి స్ఫూర్తి ద‌శాబ్దాలు గ‌డిచినా.. భార‌తీయుల గుండెల్లో నిలిచిపోతుంద‌నేది అక్ష‌ర స‌త్యం. ఆగ‌స్టు 15 స‌మీపిస్తున్న వేళ‌.. మ‌న్యం ప్ర‌జ‌ల ఆరాధ్య దైవంగా.. స్వాతంత్ర్యోద్యమకారునిగా.. తెల్ల‌దొర‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన విప్ల‌వ యోధునిగా చ‌రిత్ర‌లో నిలిచిన అల్లూరి సీతారామ‌రాజును ఒక్క‌సారి స్మ‌రిద్దాం రండి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప‌శ్చ‌మ గోదావ‌రి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్లు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897న జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసి, త‌న‌ 15వ ఏట విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించడానికి విశాఖపట్నంలో అడుగుపెట్టారు. బాల్యం నుంచే పోరాటప‌టిమ ప్ర‌ద‌ర్శించిన అల్లూరికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రేర‌ణ మాత్రం బెంగాల్ విప్లవకారులే. వారి స్ఫూర్తితో తెల్ల‌దొర‌ల‌పై రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

salute to the unsung hero in indias freedom movement Alluri sitarama raju

ఒక్కో మాటా.. స్ఫూర్తి నిచ్చేలా..

బ్రిటిష్‌వారిపై పోరాడేందుకు విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల గిరిజన ప్రజలను సంఘటితం చేసి, చైత‌న్య ప‌రిచారు. అల్లూరి నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాటా అక్క‌డి నిర‌క్ష‌రాస్యులైన గిరిజ‌నుల్లో విప్ల‌వ స్ఫూర్తి నింపింది. అలా రంప‌ తిరుగుబాటు 1922- 1924 సంవత్సరాల చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా కొనసాగింది. సీతారామ‌రాజు త‌యారు చేసుకున్న ద‌ళంతో అనేక పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. అధికార మ‌ధంతో విర్ర‌వీగిన బ్రిటీష్ అధికారులను మ‌ట్టుపెట్టారు. వారి వ‌ద్ద‌నున్న‌ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని కొల్ల‌గొట్టి మ‌న్యం వీరునిగా తెల్ల‌దొర‌ల గుండెల్లో నిద్ర‌పోయారు. అల్లూరి పేరు చెబితే బ్రిటిష్ ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయేదంటే.. అత‌ని పోరాట పటిమ ఏ స్థాయిలో ఉందో అర్థ‌మైపోతుంది.

ఒక్క నిర్ణ‌యం.. మ‌న్యం వీరుడిగా..

అల్లూరి తిరుగుబాటుకు భ‌య‌ప‌డిన బ్రిటిస్ ప్రభుత్వం పోరాటాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణ‌యించింది. మన్యంలో అల్లూరికి అండ‌గా నిలిచిన‌వారిని నిర్థాక్షణ్యంగా హ‌త‌మార్చింది. అమాయ‌క గిరిజ‌నుల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసింది. బ్రిటిష్‌వారి చ‌ర్య‌ల‌కు బ‌లైపోతున్న గిరిజ‌నుల‌ను కాపాడుకునేందుకు సీతారామరాజు తీసుకున్న నిర్ణ‌యం నేటికీ భార‌తీయుల గుండెల్లో అత‌న్ని మ‌న్యం వీరునిగా నిలిచిపోయేలా చేసింది. విశాఖ జిల్లా మంప గ్రామానికి సమీపంలో 1924 మే 7న అల్లూరి స్వయంగా బ్రిటిష్‌వారికి లొంగిపోయారు.

అల్లూరి ప్రాణ‌త్యాగానికి 28 ఏళ్ల త‌ర్వాత‌..

అల్లూరి స్వ‌యంగా లొంగిపోయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే అత‌నిపై పగతో రగిలిపోతున్న తెల్ల‌దొర‌లు అత‌న్ని చెట్టుకు క‌ట్టి కిరాత‌కంగా కాల్చి చంపారు. అలా 1922 ఆగష్టు 22న మొద‌లైన‌ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో ముగిసిపోయింది. అల్లూరి పోరాట స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యం ముందుకుసాగింది. చివ‌ర‌కూ ఆ విప్ల‌వ వీరుడు ప్రాణ‌త్యాగం చేసిన 28 సంవత్సరాలకు తెల్ల‌దొర‌ల పాల‌న నుంచి భార‌త‌దేశానికి విముక్తి ల‌భించింది. 1947, ఆగ‌స్టు 15న మువ్వ‌న్నెల జాతీయ జెండా దేశ వ్యాప్తంగా రెప‌రెప‌లాడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+