ఘాట్: సోనియా చిత్రానికి సమాధి కట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: సమైక్యాంధ్రను రక్షించాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యవాదులు వినూత్న నిరసనల తెలుపుతున్నారు. పదమూడు జిల్లాల్లో సమైక్యవాదులు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం, తెలంగాణ నోట్‌కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమైక్యవాదులు మరింత ఆందోళన చెందుతున్నారు.
సమైక్య ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ తదితరుల చిత్రాలను ప్రదర్శించి, దగ్ధం చేసి నిరనసనలు తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో సోనియా గాంధీ చిత్రపటానికి సమాధి కట్టి సమైక్యవాదులు నిరసన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాజీకియా విభజన శక్తులు అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సమాధి కట్టి, సోనియా గాంధీ అమర్ హై అంటూ రాశారు. దీనిపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. సుమోటోగా స్వీకరించాలని డిజిపికి ఫిర్యాదు చేశారు.

సోనియా 1
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి కొందరు సమైక్యవాదులు సమాధి కట్టి తమ నిరసనను తెలిపారు.

సోనియా 2
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని, కేబినెట్ తెలంగాణ నోట్‌ను వ్యతిరేకిస్తూ తిరుపతిలో సమైక్యవాదులు ఏఐసిసి అధినేత్రి చిత్రానికి సమాధి కట్టి నిరసన వ్యక్తం చేశారు.

సోనియా 3
సమైక్యాంధ్ర కోసం ఆందోళనలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి సమైక్యవాదులు సమాధి కట్టి నిరసన తెలిపారు.

సోనియా 4
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి సమైక్యవాదులు సమాధి కట్టి, సోనియా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

సోనియా 5
తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి సమైక్యవాదులు సమాధి కట్టిస్తున్న దృశ్యం. ఈ ప్రాంతానికి సోనియా ఘాట్ అని పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications