వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మడమ తిప్పారు: ఢిల్లీ కావూరి నివాసం వద్ద హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

kavuri sambasiva rao
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పదవి రాకముందు తాను కరగడుగట్టిన సమైక్యవాదిని అని చెప్పిన ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు ఆ తర్వాత మాట మార్చారని ఆరోపిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆయన నివాసాన్ని ముట్టడించారు.

సీమాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేసిన నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నాయకులు అడారి కిషోర్ కుమార్ హెచ్చరించారు. కావూరి వెంటనే సమైక్యాంధ్ర కోసం తన పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయాలని డిమాండ్ చేసారు.

సమైక్యాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఆయన నివాసం మెయిన్ గేటు తన్నుతూ పూలకుండీలను పగులగొట్టి హంగామా సృష్టించారు. నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని తిప్పి పంపించారు.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ... మంత్రి పదవి రాకముందు కావూరిని సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని విశ్వవిద్యాలయాలకు తిప్పామని, తాను పక్కా సమైక్యవాదినని చెప్పారని, పదవి రాగానే ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారని, పదవి కోసం తెలుగు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడించేందుకు అందరు కృషి చేయాలన్నారు.

మరోవైపు న్యూఢిల్లీలోని ఎపి భవన్ ఎదుట కూడా విద్యార్థులు ధర్నా చేశారు. వారు నంది విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి సంఘాల ఐకాస ఆందోళన చేపట్టింది. ఇరువైపు పోటాపోటీగా నినాదాలు చేశాయి.

English summary

 Samaikyandhra JAC created hulchul at Union Minister Kavuri Sambasiva Rao's residence on Satureday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X