Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్-భారతి తో శిల్పా రెడ్డి సమావేశం- సమంత క్లోజ్ ఫ్రెండ్ : భేటీ వెనుక..!!

ప్రముఖ మోడల్...ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఏపీ సీఎం జగన్ దంపతులతో సమావేశమయ్యారు. శిల్పా రెడ్డి ప్రముఖ హీరోయిన్ సమంతకు క్లోజ్ ఫ్రెండ్. కొద్ది రోజుల క్రితం సమంత- శిల్పా రెడ్డి ఛార్ ధామ్ యాత్ర కు వెళ్లారు. తాను సీఎం జగన్ ను కలిసినట్లుగా శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో ఫొటో పోస్టు చేసారు. సీఎం జగన్ - భారతితో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కామెంట్ రాశారు. అందులో.. ఇంత ఆతిథ్యం, ​​ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారూ... ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ.. పేర్కొన్నారు.

సీఎంతో శిల్పారెడ్డి సమావేశం

సీఎంతో శిల్పారెడ్డి సమావేశం

తాను ఎందుకు సీఎం దంపతనులకు కలిసిందీ మాత్రం అందులో వెల్లడించలేదు. దీని పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే, ఈ సమావేశం తన వ్యక్తిగతంగా అంశాల కోసం కలిసారా అంటూ చర్చ మొదలైంది. సమంత - నాగ చైతన్య విడాకుల వ్యవహారం పూర్తిగా వారి పర్సనల్ అంశమే అయినా.. మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, వారి విడాకుల ప్రకటన తరువాత సైతం దీని పైన చర్చ సాగింది. కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగార్జున సైతం సీఎం జగన్ తో సమావేశమయ్యారు.

వ్యక్తిగతమా.. భేటీ వెనుక

వ్యక్తిగతమా.. భేటీ వెనుక

అయితే, అది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. తాజాగా, నేషనల్ మీడియాతో మాట్లాడిన సమంత..తన అభిప్రాయాలను స్పష్టంగా షేర్ చేసుకున్నారు. విడాకుల కరాణంగా తాను ఒక దశలో చనిపోతానేమో అనే భయం ఏర్పడిందని..కానీ, ఆ తరువాత తాను ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు వచి మరింత స్ట్రాంగ్ గా మారానని సమంత చెప్పుకొచ్చారు. తాను గతంలో సైకలాజికల్ గా బలహీనంగా ఉన్నానని ఫీలయ్యేదానిని చెప్పిన సమయంత..తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఫేస్ చేసిన తరువాత తాను ఎంత బలవంతురాలో తనకే అర్దం అయిందంటూ వివరించారు.

ఇంకా తేలని టిక్కెట్ల ధరల వ్యవహారం

ఇంకా తేలని టిక్కెట్ల ధరల వ్యవహారం

అసలు విడాకుల సమయంలో తన వ్యక్తిగత జీవితంతో పాటుగా.. తన ప్రొఫెషనల్ జీవితం సైతం కుప్పకూలిపోయాయనే అభిప్రాయం ఏర్పడిందని.. కానీ, ఇప్పుడు తాను చాలా ధైర్యంగా ఉన్నానని సమంత చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు శిల్పారెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులను కలవటం ద్వారా..మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తి కర చర్చకు అవకాశం ఏర్పడింది. అయితే, తాజాగా టాలీవుడ్ నుంచి సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో ఈ సమావేశం జరగటంతో ఆ విధంగానూ చర్చ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+