వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌ను చూసి ఆడోళ్లు పారిపోతున్నారా, సిగ్గుచేటు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

మంగళగిరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి వై జంక్షన్ సమీపంలో సమర దీక్షను చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ సమర దీక్ష సమయంలో మాట్లాడారు.

బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ చెప్పిందని, ఏడాది అయినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేసారని ప్రశ్నించారు. రాజధానిని ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ బలవంతంగా రైతుల భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

Samara Deeksha: Jagan to voice problems of AP people

ప్రజా బ్యాలెట్ పైన టిక్ చేయండి, బాబుకు ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం

ప్రత్యేక హోదా రానప్పుడు టీడీపీకి కేంద్రంలో పదవులు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుపై పోరాటానికి ఈ దీక్ష వేదిక అన్నారు. నిరుద్యోగులకు భృతి ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం జగన్ ప్రజా బ్యాలెట్ విడుదల చేశారు.

చంద్రబాబు పాలన బాగుంటే బ్యాలెట్ పైన యస్ అని, బాగా లేకుంటే నో అని టిక్ పెట్టాలని సూచించారు. ప్రజా బ్యాలెట్ పేపర్లు యాభై వేలకు పైగా ఉన్నాయని, వాటిని అందరికీ ఇస్తామని చెప్పారు. మీ వద్దకు వచ్చిన పేపర్లకు టిక్ చేయాలని కోరారు.

వంద వాగ్ధానాలు ఇచ్చిన బాబు: అంబటి

చంద్రబాబు గత ఎన్నికల్లో వందలు, వేల వాగ్ధానాలు ఇచ్చారని అంబటి రాంబాబు మండిపడ్డారు. మీ వద్దకు ప్రజా బ్యాలెట్ వస్తుందని, వాటిల్లో యస్ నో పేర్కొనాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు.. వైసీపీ విడుదల చేసిన ప్రజా బ్యాలెట్లో ఇవీ..

వాటి పైన రుణాల మాఫీ, ప్రత్యేక హోదా, పంటల భీమా, రైతుల రుణమాఫీ, స్వామినాథన్ సిఫార్సు మేరకు కనీస మద్దతు ధర వచ్చిందా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు వ్యవసాయ ఆధార పరిశ్రమలు వచ్చాయా, వడ్డీ లేని రుణం ఇస్తున్నారా, మహిళల భద్రతల కోసం ప్రత్యేక సిటీ బస్సులు వచ్చాయా, మహిళలకు పోలీసు స్టేషన్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి, పోటీ పరీక్షలకు వయస్సు పెంచారా, ప్రతి నిరుద్యోగికి స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారా, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారా, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగిందా, నిత్యావసర వస్తువులు తగ్గుదల, అవినీతిరహిత సుపరిపాలన అందిందా, ప్రతి జిల్లాలో సూపర్
స్పెషాలిటీ వచ్చిందా, గ్యాస్ పైన సబ్సిడీ వస్తోందా, పేద కార్మికులకు రూ.5 భోజనం ఎక్కడైనా ఇచ్చారా, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇచ్చారు, ఫీజు రీయింబర్సు మెంట్స్ చెల్లించారా, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, ఇంటింటికీ రూ.2లకే ఇరవై లీటర్ల మంచినీరు ఇస్తున్నారా, రక్షిత మంచినీరు వస్తోందా, ఉద్యోగులకు పని దినాలు ఐదుకు తగ్గించారా అని అంబటి రాంబాబు ప్రజాబ్యాలెట్లో ఉన్న కొన్నింటిని చదివి వినిపించారు.

ప్రజాబ్యాలెట్లో మొత్తం వంద ప్రశ్నలు వేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చారని మీరు నమ్ముతున్నారా అనేది వందవ ప్రశ్నగా ఉంది. వంద ప్రశ్నలు చదివిన అనంతరం అంబటి మాట్లాడుతూ.. బాబు దుష్టపాలనకు వ్యతిరేకంగా జగన్ సమర దీక్ష చేస్తున్నారన్నారు.

సిగ్గులేని ప్రభుత్వం: పార్థసారథి

చంద్రబాబు ప్రభుత్వానిది సిగ్గులేని ప్రభుత్వమన్నారు. నవ నిర్మాణ దీక్ష సమయంలో భావి ఏఫీ గురించి చెబుతారనుకుంటే.. రాష్ట్ర విభజన గురించి, సమైక్యాంధ్ర ఉద్యమం గురించి మాట్లాడారన్నారు. విభజన పైన చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదన్నారు. విభజనకు మొట్ట మొదటి కారకుడు చంద్రబాబు అన్నారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వారికే నష్టమన్నారు. ప్రజా బ్యాలెట్‌తో చంద్రబాబు పని ఎంతో తేలుతుందన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసింది కుర్చీ కోసమే అన్నారు. ప్రాజెక్టులు కడతామని చంద్రబాబు చెప్పారని, కానీ ఆయన తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి పులిచింతల కట్టలేదని చెప్పారు.

వైయస్ కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరన్నారు. చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలో ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బాబు - మోడీ కలిసి ఏపీలో అనేక కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

పోలవరం కట్టిస్తామని, ప్రత్యేక హోదా ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. మోడీ కాళ్ల దగ్గర చంద్రబాబు ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారన్నారు. ఆడవాళ్లు జగన్‌ను చూసి భయపడుతున్నారని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఇంతకంటే నీచం లేదన్నారు.

ఓ అవ్వగా, చెల్లిగా, తల్లిగా జగన్ మహిళలను కలుస్తుంటారని చెప్పారు. జగన్‌కు కోపం అని చెప్పడం విడ్డూరమన్నారు. జగన్ మనస్ఫూర్తిగా అన్నా అంటూ పలకరిస్తారని అన్నారు. జగన్ ఎవరినైనా గౌరవిస్తారన్నారు. జగన్ పోరాటం చేస్తే ప్రజలు ఆయన వెంటే ఉంటారన్నారు.

English summary
Samara Deeksha: Jagan to voice problems of AP people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X