ఎర్రచందనం బడా స్మగ్లర్ అరెస్టు: బంగారం పట్టివేత

అంతర్జాతీయ స్మగ్లర్ సాహుల్ అమీద్‌తో బాలరాజుకు సంబంధాలు ఉన్నాయని, దుబాయ్‌లో తలదాచుకున్న సాహుల్‌ను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరామని, రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేశామని తెలిపారు. సాహుల్‌పై తిరుపతి, నెల్లూరు జిల్లాలో 20 కేసులు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. తమిళనాడు, కాండ్లా, ముంబై ఓడ రేవుల ద్వారా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించేవారని ఎస్పీ రాజశేఖర్ తెలియజేశారు.
ఇదిలా వుంటే, సికింద్రాబాద్‌లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న 12 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం పోలీసుల తనిఖీలు నిర్వహించగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పన్ను కట్టకుండా బంగారం వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారాన్ని ఆదాయ, వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించారు. పట్టుబడిన బంగారం విలువ నాలుగుకోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జ్యువెలరీ షాపులకు రవాణా చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications