టిడిపిలో చేరిన శత్రుచర్ల, కిరణ్‌రెడ్డి పార్టీ గుర్తు పాదరక్షలు
హైదరాబాద్/విశాఖ: మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు, ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్‌లు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడి నుండి పోటీ చేయమంటే తాము అక్కడి నుండి పోటీకి సిద్ధమన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయగల సామర్థ్యం కేవలం చంద్రబాబుకే ఉందన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా టిడిపిలో చేరామని శత్రుచర్ల, ఎమ్మెల్యే థాట్రాజు చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబే అన్నారు. సీమాంధ్రలో టిడిపి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్నారు.

జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు పాదరక్షలు
విశాఖపట్నంలో జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ గుర్తును ఆవిష్కరించారు. పాదరక్షలను పార్టీ గుర్తుగా ప్రకటించారు. తెలుగుజాతి ఆత్మ గౌరవ సభ విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కిరణ్ గుర్తును ఆవిష్కరించారు.
తెరాసలో చేరడం లేదు: శ్రీధర్
తాను తెరాసలో చేరుతున్నానన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ చెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications