సత్య నాదెళ్ళపై బుక్: ఆసక్తికర విషయాల ప్రస్తావన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్‌ అనే పుస్త‌కం త్వ‌ర‌లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లకానుంది. ఇంగ్లిషులో బెస్ట్ సెల్ల‌ర్‌గా నిలిచిన ఈ పుస్త‌కంలో హైద‌రాబాద్ నుంచి అమెరికాలోని రెడ్మండ్ వ‌ర‌కు త‌న ప్ర‌యాణాన్ని నాదెళ్ల వివ‌రించారు.

క్లౌడ్ కంప్యూటింగ్‌, మైక్రోసాఫ్ట్ 365, విండోస్ 10 వంటి విప్ల‌వాత్మ‌క ఉత్ప‌త్తుల‌ను త‌య‌రుచేయ‌డంలో త‌న‌ భార‌త మూలాలు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాయో నాదెళ్ల ఈ పుస్త‌కంలో వివ‌రించారు.

Satya Nadella's 'Hit Refresh' now in Hindi, Telugu and Tamil

హిట్ రీఫ్రెష్‌ హిందీ పుస్త‌కాన్ని హ‌ర్పర్ కొలిన్స్ ఇండియా ప్ర‌చురిస్తుండ‌గా, తెలుగు, త‌మిళ వెర్ష‌న్ల‌ను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్ర‌చురిస్తోంది. న‌వంబ‌ర్ 7న ఈ వెర్ష‌న్లు మార్కెట్లో విడుద‌ల‌కానున్న‌ట్లు స‌మాచారం.

తెలుగువాడైన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సిఈఓగా ఉన్నారు. తన ప్రస్థానాన్ని నాదెళ్ళ ఈ పుస్తకంలో వివరించారు. తెలుగు వర్షన్ అందుబాటులోకి రానుండడంతో ఆయన గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొనే అవకాశం కలిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India-born Microsoft CEO Satya Nadella's bestseller "Hit Refresh" will soon be available in Hindi, Telugu and Tamil. The Hindi edition, published by HarperCollins India, will be available at bookstores by the end of this month.The Tamil and Telugu editions, published by Westland Books.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి