ఆటో డ్రైవర్ల కోసం రంగంలోకి సాయిరెడ్డి..! కేంద్రానికి రిక్వెస్ట్..!
ఏపీలో గతేడాది వైసీపీకి, ఎంపీ పదవికి, ఫైనల్ గా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి.. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సాయిరెడ్డి.. ఆ తర్వాత కేంద్రంతో టచ్ లోకి వెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఏపీకి సంబంధించిన సమస్యలతో పాటు జాతీయ స్ధాయిలో సమస్యల్ని సైతం కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం స్పందనతో సంబంధం లేకుండా ఆయన వరుసగా ఎక్స్ లో పలు సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విదేశీ టాక్సీ యాప్ లు ఆటో డ్రైవర్లను 30 శాతం కమిషన్ తో దోపిడీ చేస్తున్నాయని, వీటి బారి నుంచి వారిని కాపాడాలని విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆయన తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్వదేశీ యాప్ భారత్ టాక్సీని తెరపైకి తెచ్చారు. దీన్ని ఏపీలోని అన్ని నగరాలకు విస్తరించడం వల్ల ఆటో డ్రైవర్లకు న్యాయమైన జీవఉపాధి లభిస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

I request Hon’ble FM @nsitharaman Garu to address the concerns of auto drivers in Andhra Pradesh, who are facing serious challenges due to intense competition from foreign-based apps charging nearly 30% of the tariff. Extending indigenous #BharatTaxi to all major cities in AP can…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 16, 2026
భారత్ టాక్సీ యాప్ అనేది మన దేశంలో స్థానిక, అవుట్‌స్టేషన్ మరియు అద్దె క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లను బుక్ చేసుకోవడానికి సర్టిఫైడ్ డ్రైవర్లను అందిస్తుంది. కేంద్రం తెచ్చిన ఈ యాప్ ద్వారా పారదర్శక ధర నిర్ణయం, కమీషన్లు లేకుండా డ్రైవర్లకు ప్రత్యక్ష చెల్లింపులు చేస్తున్నారు. ఇది ఉబెర్, ఓలా వంటి ఇప్పటికే ఉన్న యాప్ లతో పోటీపడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రియల్-టైమ్ ట్రాకింగ్, శానిటైజ్డ్ క్యాబ్‌లు, 24/7 హెల్ప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ భారత్ టాక్సీ యాప్ ను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా నగరాలకు విస్తరిస్తారు.












Click it and Unblock the Notifications