దేశంలోనే అత్యంత సంపన్న మహిళ
ప్రపంచ ధనవంతుల జాబితా అంటే పురుషులే కాదు.. మహిళలు కూడా ఉంటారు. ఈ జాబితాలో జర్మనీ, భారత్, ఇటలీ, అమెరికా తదితర దేశాలకు చెందిన మహిళా బిలియనీర్లు చేరారు. అమెరికాలో బిలియనీర్లైన మహిళలు 92 మంది ఉండగా, మనదేశంలో 9, జర్మనీలో 36, ఇటలీలో 16, చైనాలో 46 మంది ఉన్నారు. అత్యంత ధనవంతులైన మహిళలు ఎవరు? వారేం చేస్తుంటారు? లాంటి విషయాలను తెలుసుకుందాం.
భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. ఓపీ జిందాల్ భార్య. 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ మరణించారు. తర్వాత బాధ్యతలను సావిత్రి చేపట్టారు. సావిత్రి జిందాల్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తి నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు (రూ. 13,504 కోట్లు) ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఉంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె 101వ స్థానంలో నిలిచారు.

విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఉక్కు, సిమెంటు తదితర వ్యాపారాలు ఈ కుటుంబానికి ఉన్నాయి. హర్యానా రాష్ట్ర మంత్రిగా, విధాన సభ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ఇచ్చింది. ఈ సంస్థ 1952లో ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో మూడోది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ కంపెనీ యజమాని ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్. ఆమెకు రిలయన్స్ ముఖేష్ అంబానీకంటే ఎక్కువగా ఆస్తి ఉంది. బెటెన్‌కోర్ట్‌కు $ 85.9 బిలియన్ల ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 78.8 బిలియన్ డాలర్లు. భారతదేశంతోపాటు ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ముఖేష్ అంబానీ నిలిచారు.












Click it and Unblock the Notifications