స్తంభించిన SBI సేవలు.. పనిచేయని ATMలు.. రేపు కూడా కష్టమే?
భారతీయ స్టేట్‌బ్యాంకు (SBI) సేవలు పూర్తిగా స్తంభించాయి. ATM కేంద్రాల నుంచి నగదు రావడంలేదు. తీసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ''సారీ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్'' అంటూ మెసేజ్ వస్తోంది. కొన్ని ATM కేంద్రాల్లో అయితే నేరుగా తెరమీదే ''నో సర్వీస్'' అని చూపిస్తోంది. అంతేకాదు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. ఆర్టీజీఎస్, ఇతర సేవలు స్తంభించాయి. దీనిపై ఇంతవరకు SBI అధికారులు నోరు విప్పలేదు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. సమస్య ఎక్కడ ఉత్పన్నమైందనే విషయాన్ని అధికారులు ఇంతవరకు కనుగొనలేకపోయారు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో, అలాగే UPI సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ATMకేంద్రాల నుంచి నగదు రాకపోవడతో మనక్కొరికే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయేమోనని వినియోగదారులు భావించారు. కానీ SBIకి సంబంధించి ఎక్కడి ATM కేంద్రానికి వెళ్లినా, క్యాష్ డిపాజిట్ మెషిన్‌కు వెళ్లినా ''నో సర్వీస్'' అని తెరపై దర్శనమిస్తోంది. దీంతో వినియోగదారులకు ఏం చేయాలో పాలుపోక సంబంధిత బ్యాంకు శాఖలకు వెళ్లినా అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోయారు.

మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. అయితే సేవల పునరుద్ధరణకు సంబంధించి భారతీయ స్టేట్‌బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన లేదు. వినియోగదారులు yono యాప్ తెరవడానికి ప్రయత్నించినప్పుడు కూడా నిర్వహణ లోపం కారణంగా అంతరాయం ఏర్పడుతున్నట్లు మెసేజ్ దర్శనమిస్తోంది. నెలాఖరులో ఇటువంటి సమస్య తలెత్తడంపై ఉద్యోగులు, పింఛనుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. కనీసం SBI ఉన్నతాధికారులనుంచి ఒక ప్రకటన వెలువడినా వినియోగదారులు ఊరట చెందేవారు. కనీసం ఆ ప్రకటన కూడా వెలువడకపోవడం వారిని మరింత నిరుత్సాహానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications