వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వీరే: మరో రెండు రాష్ట్రాలకు: సుప్రీం కొలీజియం సిఫారసు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుమంది కొత్త న్యాయమూర్తులను నియమించింది దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం. సీనియర్ అడ్వొకేట్లకు న్యాయమూర్తులగా పదోన్నతి కల్పించింది. ఏపీతో మరో మధ్య ప్రదేశ్, ఒడిశా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులను నియమించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేసింది. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఈ సిఫారసులపై ఆ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం పొందిన వెంటనే కొత్త న్యాయమూర్తులు బాధ్యతలను స్వీకరిస్తారు.

గంటకు 9 వేల కి.మీ వేగం: చంద్రుడిని ఢీ కొట్టనున్నపవర్‌ఫుల్ రాకెట్: సమయం లేదు మిత్రమాగంటకు 9 వేల కి.మీ వేగం: చంద్రుడిని ఢీ కొట్టనున్నపవర్‌ఫుల్ రాకెట్: సమయం లేదు మిత్రమా

ఏపీ, మధ్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల హైకోర్టుల కోసం మొత్తం 17 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ సిఫారసులను ఇచ్చింది. మరోో న్యాయమూర్తికి చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ చేసింది. ఈ మేరకు సీనియర్ అడ్వొకేట్ల పేర్లతో కూడిన జాబితాను కొలీజియం ఆమోదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యాన్ని వహిస్తోన్న ఈ కొలీజియంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్‌ సభ్యులుగా ఉన్నారు.

SC collegium recommended 17 names for appointment as judges in AP, MP and Orissa high courts

రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు ఏడుమంది కొత్త న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు చేసింది. సీనియర్ అడ్వొకేట్లు కొనకంటి శ్రీనివాస రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాత ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులు కావాల్సి ఉంది.

మధ్య ప్రదేశ్ హైకోర్టు కోసం న్యాయవాదులు మణీందర్ సింగ్ భత్తీ, ద్వారకాధీశ్ భన్సాల్, మిలింద్ రమేష్ ఫాడ్కేను న్యాయమూర్తులుగా రెకమెండ్ చేసింది. వారితోపాటు ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు అమర్‌నాథ్ కేశర్వాణి, ప్రకాష్ చంద్ర గుప్తా, దినేష్ కుమార్ పలివాల్‌ను కూడా మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులగా నియమించడానికి సిఫారసు చేసింది. నలుగురిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. సీనియర్ అడ్వొకేట్లు వీ నర్సింగ్, సంజయ్ కుమార్ మిశ్రా, బిరాజ ప్రసన్న సతపతి, రమణ్ మురహరి పేర్లను సిఫారసు చేసింది. వారి పేర్లతో కూడిన జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది.

English summary
The Supreme Court collegium recommended 17 names for appointment as judges in Andhra Pradesh, Madhya Pradesh and Orissa high courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X