కేరళం సీఎం తొలి నిర్ణయాలు..! ఆశా వర్కర్లకు 3 వేలు పెంపు, ఉచిత బస్సు సహా ..!
కేరళం (Kertalam)లో తాజాగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యూడీఎఫ్ (UDF)ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా వీడీ సతీశన్ (VD Satheesan) తో పాటు మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత వెంటనే సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వీడీ సతీశన్.. అనంతరం కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం సీఎం వీడీ సతీశన్ తానే స్వయంగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎక్స్ లో పెట్టిన పోస్టులో వీడీ సతీశన్..
యూడీఎఫ్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుందన్నారు. తమ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని ₹3,000 పెంచడానికి ఆమోదం తెలిపామన్నారు. అలాగే వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేశామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వంట కార్మికులు, ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాల గౌరవ వేతనాల పెంపునకు కూడా ఆమోదం ఇచ్చినట్లు సతీశన్ వెల్లడించారు.

The #UDF Government has walked the talk. In our very first Cabinet meeting, we approved a ₹3,000 hike in the honorarium for #ASHAworkers and created a dedicated portfolio for the welfare of the elderly.
— V D Satheesan (@vdsatheesan) May 18, 2026
Honorarium hikes for #Anganwadi workers, cooking workers, pre-primary…
వీటితో పాటు మహిళలకు కేరళం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం జూన్ 15 నుండి అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇలా మొదటి రోజు నుంచే తమ వాగ్దానాలను నెరవేరుస్తున్నామని వీడీ సతీశన్ సంతోషంగా వెల్లడించారు. కేరళలో కాంగ్రెస్, ఐయూఎంల్ కూటమి అయిన యూడీఎఫ్ పదేళ్ల తర్వాత విజయం సాధించింది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే విషయంలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారానికి విపక్ష నేతలందరినీ ఆహ్వానించడంతో పాటు దగ్గరుండి రప్పించిన వీడీ సతీశన్.. ఇకపై పాలనపై పూర్తి స్ధాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు.














Click it and Unblock the Notifications