రూ. 4,000 కే 'వైజాగ్ టూర్'.. ఈ 7 ప్రాంతాలను చుట్టేయొచ్చు.. TGSRTC సూపర్ ఆఫర్..

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక వేసవి సెలవులు కావడంతో ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాలను చూసి బోర్ కొట్టిందా..? అయితే ఎంచక్కా ఏపీలోని వైజాగ్ కు వెళ్లండి.. విశాఖలోని సముద్ర తీరాన హాయిగా విహరించే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నంకు దగ్గరలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే అవకాశం ఉంది. అయితే పర్యటకుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు సూపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. వైజాగ్ యాత్ర పేరుతో ఈ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ప్యాకేజీకి చెందిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

తెలంగాణ ప్రజలకు ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాల్ని, పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల టూర్ ను వాయిదా వేస్తుంటారు. ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటి. సిటీ ఆఫ్ డెస్టినీ అని విశాఖను పిలుస్తుంటారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలతోపాటుగా అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇక విశాఖలోని ఆర్ కే బీచ్ ను సందర్శించేందుకు నిత్యం వందలాది మంది పర్యటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో TGSRTC తక్కువ ధరకే పర్యటకుల కోసం వైజాగ్ యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది.

VizagTour for Just 4 000 TGSRTC Super Offer to Visit 7 Tourist Spots in Visakhapatnam Vizag Tour

TGSRTC బండ్లగూడ డిపో నుంచి ఈ యాత్ర మే 21న గురువారం ప్రారంభం కానుంది. వైజాగ్ యాత్ర మెట్రో డీలక్స్ బస్సులో సాగుతుంది. మొత్తం 4 రోజుల పాటు సాగే ఈ టూర్‌ లో అన్నవరం, అరసవెల్లి, శ్రీ కూర్మం, సింహాచలం, బొర్రా గుహలు, వైజాగ్, విజయవాడ వంటి 7 ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే పెద్దలకు అయితే రూ.4,000 గా ఉంది. అదే పిల్లలకు అయితే రూ.2,500 గా ఉంది. ఇక భోజనం, వసతి అదనం అందులోనే యాడ్ అయి ఉంటుంది. పర్యటకుల కోసం పికప్ పాయింట్స్ చూస్తే.. నాగోల్, ఎల్బీ నగర్, హయత్‌నగర్.. ఇక వైజాగ్ యాత్ర కోసం పూర్తి సమాచారం కోసం డిపోను సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+