షాక్: కౌన్సెలింగ్‌కి సుప్రీం నో, తప్పు చేసి కోర్టుకెందుకు
న్యూఢిల్లీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు గురువారం అనుమతి నిరాకరించింది. 65వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయని, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశఅ ఉన్నత విద్యామండలి చేసిన అభ్యర్థునను న్యాయస్థానం తోసిపుచ్చింది.
సకాలంలో కౌన్సెలింగ్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలునే కొనసాగించాలని తెలిపింది. తాము చెప్పినప్పుడు ఎందుకు కౌన్సెలింగ్ నిర్వహించలేదని ప్రశ్నించింది. మీరు తప్పు చేసి మళ్లీ మళ్లీ కోర్టుకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించింది. 1వ తేదీ నుండి క్లాసులు ప్రారంభమైనందున ఇప్పుడు కౌన్సెలింగ్ వద్దని చెప్పింది.

సుప్రీం కోర్టు తీర్పు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిణామమేనని ఉన్నత విద్యామండలి శాఖ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీ వచ్చాక ఏం చేయాలో నిర్ణయిస్తామని అన్నారు. మరోవైపు, ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అనే విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications