Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..!
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, వైఎస్ జగన్ కు సన్నిహితుడు కూడా అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (Peddireddy Ramachandra Reddy) ఇవాళ సుప్రీంకోర్టులో ఝలక్ తగిలింది. ఏపీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి ఆయన భార్య పేరిట దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆయనకు షాకిచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బిల్లులు రాబట్టుకొనే విషయంలో పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పి.ఎల్.ఆర్ కంపెనీ చిత్తూరు జిల్లాలో పలు రోడ్డు పనుల్ని చేపట్టింది. వీటికి సంబంధించి బిల్లులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఈ బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తాము ఇందులో నేరుగా జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది.

ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ వ్యవహారంపై ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీనిపై స్పందించిన పెద్దిరెడ్డి తరఫు లాయర్లు.. ఇప్పటికే తాము ఏపీ హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయినా హైకోర్టు పరిధిలోనే ఈ అంశం పరిష్కారం కావాలని ధర్మాసనం తేల్చిచెప్పేసింది. దీంతో సుప్రీంకోర్టు సూచన మేరకు పెద్దిరెడ్డి తరఫు లాయర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులోనే వారు ఈ బిల్లుల వ్యవహారం తేల్చుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications