Narayana : మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం..
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించింది.
ఏపీలో గతేడాది చోటు చేసుకున్న పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఇవాళ సుప్రీంకోర్టు కాస్త ఊరటనిచ్చింది. గతంలో ఆయనపై దాఖలైన కేసులో బెయిల్ రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సమగ్రంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తిరిగి సెషన్స్ కోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.
గతేడాది టెన్త్ పేపర్ లీక్ కేసులో చిత్తూరు పోలీసులు తొలిసారి నారాయణను అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టు చేసి చిత్తూరు కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచారు. అయితే చిత్తూరు కోర్టు నారాయణ వాదన పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నారాయణ బెయిల్ ను రద్దు చేడంతో ఆయన సుప్రీంకోర్టున ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. స్ధానిక కోర్టులో మరోసారి విచారణకు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే మరో ట్విస్ట్ కూడా ఇచ్చింది.

నారాయణ కేసుపై సెషన్స్ కోర్టు మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అలాగే సెషన్స్ కోర్టు తీర్పుపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటివరకూ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలువరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో నారాయణ కేసులో విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ముగించింది.












Click it and Unblock the Notifications