వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మ జగనా?': వైసీపీకి సుప్రీం దిమ్మతిరిగే షాక్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

It's A Victory For Press Freedom

న్యూఢిల్లీ: అప్పట్లో వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీతో భేటీ అయినప్పుడు.. మరుసటిరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'అమ్మ జగనా' పేరుతో ఒక కథనం ప్రచురితమైంది. జగన్ పైకి చెబుతున్నది ఒకటి.. లోపల మోడీతో జరిపిన మంతనాలు మరొకటి అనే ఉద్దేశంతో ఆ కథనాన్ని ప్రచురించింది.

వక్రీకరించారా?: ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాక్.. వచ్చి తీరాల్సిందేనన్న హైకోర్టు..వక్రీకరించారా?: ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాక్.. వచ్చి తీరాల్సిందేనన్న హైకోర్టు..

ఈ కథనం పాఠకులను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా.. నిజాలను వక్రీకరిస్తూ సాగిందని వైసీపీ భగ్గుమన్నది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి సుప్రీం దాకా వెళ్లారు. కానీ అక్కడ కూడా జగన్ కు ప్రతికూలంగానే తీర్పు వెలువడటం గమనార్హం.

'పరువు నష్టం'తో సంబంధం లేదన్న సుప్రీం..:

'పరువు నష్టం'తో సంబంధం లేదన్న సుప్రీం..:

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం ఆళ్ల రామ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది.

అయితే ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దాన్ని తోసిపుచ్చింది ధర్మాసనం. అంతేకాదు, అసలు ఈ కథనానికి 'పరువు నష్టం'కు లింకే లేదని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. దీంతో వైసీపీకి భంగపాటు తప్పలేదనే చెప్పాలి.

ఇంత సున్నితంగా ఉంటే ఎలా?..:

ఇంత సున్నితంగా ఉంటే ఎలా?..:

పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి తెలుగులో ప్రచురించిన కథనానికి ఇంగ్లీషు అనువాదాన్ని న్యాయమూర్తికి చదివి వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. ఆయన వార్తను చదువుతుండగానే.. మధ్యలోనే కలగజేసుకున్న న్యాయమూర్తి.. 'ప్రముఖుల భేటీలు జరిగినప్పుడు ఇలాంటివి సహజం.. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇంత సున్నితంగా ఉండకూడదు' అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దానికీ అంగీకరించలేదు..:

దానికీ అంగీకరించలేదు..:

విమర్శలను సంయమనంతో, సహనంతో ఎదుర్కోవడమో, నవ్వి వదిలేయడమో చేయాలని న్యాయమూర్తి పిటిషనర్ కు వెల్లడించారు. కాగా, ఇదివరకే ఈ పిటిషన్ హైకోర్టులోనూ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

సుప్రీంలో కేసు విచారణ సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పిటిషన్ కొట్టివేసిన సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కొట్టివేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. దీనికి కూడా సుప్రీం అంగీకరించలేదు.

ఇలాంటి వార్తలను పరువు నష్టం అనలేం..:

ఇలాంటి వార్తలను పరువు నష్టం అనలేం..:


'హైకోర్టుకు తీర్పు జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని, తొలుత మాకిది పరువు నష్టం దావా కిందకు వస్తుందనిపించేలా ఉండాలి'అని సుప్రీం వెల్లడించింది.

అంతేకాదు, ఇలా అవనసరమైన పిటిషన్లు వేస్తే.. మరింత ప్రచారం జరిగి సదరు వ్యక్తికి(జగన్‌కు) నష్టం జరుగుతుందని వెల్లడించింది. ఇలాంటి వార్తలను పరువు నష్టం కింద పరిగణించలేమని సూటిగా చెప్పింది.

గతేడాది మే 15న:

గతేడాది మే 15న:

గతేడాది మే 15వ తేదీన ఆంధ్రజ్యోతిలో 'అమ్మ జగనా' అంటూ ప్రచురితమైన కథనంపై ఈ పిటిషన్ దాఖలైంది. జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు.. మోడీకి ఏడు పేజీల సుదీర్ఘ వినతిపత్రాన్ని అందజేశారని అందులో పేర్కొంది.

చంద్రబాబు ప్రోద్బలంతో ఈడీ తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని దాని బారి నుంచి కాపాడాలని కూడా జగన్ జగన్ అందులో పేర్కొన్నట్టు చెప్పింది. తాను రైతుల గురించి, ఫిరాయింపుల పర్వం గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధాని వద్ద మాట్లాడితే.. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తారా? అని వైసీపీ మండిపడింది. ఆ కారణంతోనే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం వరకు వెళ్లింది.

English summary
In a victory for press freedom, the Supreme Court on Monday dismissed a defamation plea filed against Amoda Publications, which prints Telugu newspaper Andhra Jyothi for allegedly bringing disrepute to YSR Congress President YS Jagan Mohan Reddy. The plea was filed by YSR Congress party MLA Alla Rama Krishna Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X