రోజా సస్పెన్షన్: ప్రభుత్వానికి సుప్రీం నోటీస్‌లు, హైకోర్టు తీర్పుపై ఆగ్రహం!

న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా సస్పెన్షన్ అంశంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించిందని తెలుస్తోంది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్పందిస్తూ... 340(2) కింద చర్య తీసుకోలేదని, 194 కింద చర్యలు తీసుకున్నామని చెప్పడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

SC sent notices to AP government and AP chief secretary

ఓ రూల్ కింద చర్యలు తీసుకుంటే మరో రూల్ కింద తీసుకున్నారని చెప్పడం సరికాదని హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును తప్పుబట్టింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది పీపీ రావు వాదనలు చేస్తుండగా సుప్రీం కోర్టు కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ... అసెంబ్లీలో జరిగే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఆ హక్కులు కోర్టులకు ఉండవని వాదించారు.

రోజా తరఫు న్యాయవాది స్పందిస్తూ... శాసన వ్యవస్థ వ్యవహారాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవన్నది నిజమే అయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే జోక్యం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. రోజా న్యాయవాది చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.

వైసిపి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై రోజా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్ స్వీకరించకపోవడంతో ఆమె సుప్రీం కోర్టు గడప తొక్కారు.

రోజా పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. హైకోర్టుకు మరోసారి వెళ్లాలని, ఆమె పిటిషన్ విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు బెంచ్‌లో రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

దీంతో, రోజా సస్పెన్షన్ తీర్పు పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజా పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అనంతరం ఈ రోజు ప్రభుత్వానికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వారంలో వివరణ ఇవ్వాలని చెప్పింది. కాగా, రోజా ఇష్యూ హైడ్రామాగా మారిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+