సజ్జలకు బిగుస్తున్న ఉచ్చు - ఉక్కిరి బిక్కిరి..!!
వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వారికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అనుచిత పోస్టులు చేసిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసారు. వరుస అరెస్టుల పైన జగన్ తో సహా పార్టీ ముఖ్యులు మండి పడుతున్నారు. వైసీపీ మహిళల పైన పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూసిన సజ్జల భార్గవ్ పైన కేసు నమోదైంది.
వైసీపీ సోషల్ మీడియా మద్దతు దారుల అనుచిత పోస్టింగ్స్ పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. వ్యక్తిగత దూషణలు, ఫొటోల మార్పుతో సహా ఏహ్యమైన భాష ప్రయోగించిన వారి పైన కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉ్న సమయంలో పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా పని చేసిన సజ్జల భార్గవ్ రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన దళితుడైన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

ఇప్పటికే వైసీపీ మద్దతు దారు వర్రా రవీందర్ రెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. వర్రా పైన చర్యల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వర్రా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, పోలీసు అధికారులు మాత్రం నిర్ధారించటం లేదు. వర్రా రవీందర్‌రెడ్డి ఐదేళ్లుగా టీడీపీ నేతలతో పాటు జగన్‌ను విమర్శించే వారిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్‌రెడ్డితో పాటు పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పట్టణ పోలీస్ అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియా పోస్టుల పైన ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురి పైనా కేసు పెట్టారు. ఇటు వైసీపీ ఈ అరెస్టుల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. టీడీపీ, జనసేన శ్రేణులు పెడుతున్న పోస్టింగ్స్ పైన కేసులు నమోదు చేస్తోంది. పోలీసులు వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా కేసుల వ్యవహారం రాజకీయంగా వేడి పెంచుతోంది.












Click it and Unblock the Notifications