విద్యార్ధుల మధ్య గొడవ.. అపస్మారక స్ధితిలో బాలుడు

School assistant gives corporal punishment student admitted to hospital
నల్గొండ: నాలుగు రోజుల క్రితం తిరుమలగిరిలో ఒకటో తరగతి విద్యార్ధిని టీచర్ కొట్టడంతో మృతి చెందిన ఘటన మరవకముందే నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే మరోకటి జరిగింది. నల్గొండ జిల్లాలోని ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని రాములు అనే స్కూల్ అసిస్టెంట్ దారుణంగా కొట్టారు.

దీంతో ఆ విద్యార్ధి అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. అతడి ఎడమ చేతికి విరిగిపోయినట్లుగా భావిస్తున్నారు. ఐతే వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సూర్యపేట సరస్వతీ విద్యామందిర్‌లో జరిగింది.

బాలుడిని కొట్టిన స్కూల్ అసిస్టెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై నల్గొండ జిల్లా డీఈఓ విశ్వనాథం స్పందించారు. సూర్యాపేటలోని సరస్వతీ విద్యామందిర్‌లో ఆరోతరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధులు గొడపడ్డారని.. దాంతో స్కూల్ అసిస్టెంట్ రాములు వెళ్లి ఆ గొడవ ఆపి, మందిలించినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు.

ఐతే మెడపైన కొట్టడంతో నరాల మీద ఒత్తిడి కలిగి బాలుడు వాంతులు చేసుకున్నాడని.. అతడిని స్ధానికి ఆసుపత్రికి, అక్కడ నుంచి ఏరియా ఆసుపత్రికి పంపారని చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలను కొట్టకూడదని, దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకుని పోలీసు కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

ఈ విషయంపై సరస్వతీ విద్యామందిరం స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామని, విచారణలో తేలిన అంశాలను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+