ప్రవీణ్ ప్రకాష్ సారొస్తారు... 'ఉల్లిపాయ అట్టు' సిద్ధం చేయండి!!
పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లాల పర్యటనలు చేసే సమయంలో ఆయన తీసుకునే ఆహార మెనూ కూడా సిద్ధం చేసి ఉంచాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాత్రి సమయంలో ఎక్కడైనా బస చేస్తే ఆ సమయానికి ఆయనకు ఎటువంటి మెను అందించాలనేది కూడా పేర్కొన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు సాయంత్రం నాలుగు గంటల వరకు తనిఖీలు చేస్తారు. ఆ తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) సందర్శించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, ఉపాధ్యాయులకు శిక్షణ, నాడు-నేడు, మధ్యాహ్న భోజనం, విద్యాకానుక, సీబీఎస్ ఈ అనుబంధం తదితరాలపై అధికారులు సమాచారాన్ని సిద్ధం చేస్తారు. వాటితోపాటుగా మెనూను కూడా సిద్ధం చేయాలి. ఇటీవలే ఆయన విజయవాడకు సమీపంలోని కొండపల్లి, మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ఎక్కడైనా బస చేస్తే.. మెనూ ఇలా ఉంటుంది.
ఉదయం 6.00 గంటలకు టీ ఇవ్వడంతోపాటు క్రాక్ జాక్ బిస్కెట్లు లేదా పార్లే బిస్కెట్లు.
ఉదయం 8.00 గంటలకు ఉల్లి దోశ, దోశ, ఇడ్లీ వీటిల్లో ఏదో ఒకటి అల్పాహారం కింద ఇవ్వాలి.
మధ్యాహ్నం 1.30 గంటలకు చపాతి లేదా పుల్కా. అన్ని వెజిటబుల్స్ తో కర్రీ.
* సాయంత్రం 5.00 గంటలకు టీ, బిస్కెట్స్ ఇవ్వాలి.
* రాత్రి 8.30 గంటలకు కూరగాయల కూరతో పుల్కా లేదా చపాతి, దాంతోపాటు ఒక గ్లాసు పాలు.
* మాంసాహారం, పండ్ల రసాలు, పండ్లు, ఎండు ఫలాలు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోరు.













Click it and Unblock the Notifications