వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్కూల్స్ సెప్టెంబర్ 5 నుండే .. అకడమిక్ క్యాలెండర్ లోమార్పు

|
Google Oneindia TeluguNews

ఏపీలో బడి గంట మోగే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇంతకాలం మూతపడిన స్కూల్స్ తిరిగి తెరగడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో కేసులు పెరుగుతున్నా సరే , వాటి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న సర్కార్ విద్యా సంవత్సరం నష్టం కాకుండా కరోనా విషయంలో జాగ్రత్తలు వహిస్తూ స్కూల్స్ నడపాలని భావిస్తుంది . వచ్చేనెల 5వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Recommended Video

Schools Reopen In AP : సెప్టెంబర్ 5 నుండే.. కొత్త అకడమిక్ క్యాలెండర్ రెడీ!

ఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటుఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటు

సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండటం కోసం పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగా కసరత్తులు చేస్తోంది.

Schools re-open from september 5th in ap .. changes in academic calender

పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా కరోనా నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు మొత్తం ఎనిమిది పీరియడ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు ఇవి జరగనున్నట్లుగా తెలుస్తుంది.

ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2021 విద్యాసంవత్సరంలో 181 రోజులు మాత్రమే పని దినాలుగా ఉంటాయి. ఈసారి ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడంతో సెలవులు కూడా బాగా తగ్గించింది .దసరా పండుగకు ఐదు రోజులు మాత్రమే ఇవ్వాలని, సంక్రాంతికి ఆరు రోజులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 22 నుంచి 26 వరకు దసరాకు సెలవు దినములుగా నిర్ణయించగా, వచ్చే సంవత్సరం జనవరి 12 నుండి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవు దినాలుగా నిర్ణయం తీసుకుంది . ఇక క్రిస్మస్ కు డిసెంబర్ 24 నుండి 28 వరకు, అలాగే వచ్చే ఏడాది వేసవి సెలవులు 2021 ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకుగా నిర్ణయించారు.

English summary
The AP government has prepared an academic calendar in view of the current situation to maintain schools from September 5. The government has decided to reduce the curriculum by 30 per cent to avoid putting pressure on students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X