వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో త్వరలోనే స్కూల్స్ .. డిగ్రీ,పీజీ పరీక్షలపై కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం: మంత్రి సురేష్

|
Google Oneindia TeluguNews

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకుంటాయి అని పేర్కొన్నారు. డిగ్రీ ,పీజీ పరీక్షలపై కేంద్రం నుంచి వచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సురేష్, ప్రస్తుతం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలో రూపురేఖలు మార్చడానికి నాడు-నేడు చేపట్టామని పేర్కొన్న మంత్రి ప్రభుత్వం ప్రధానంగా విద్యా వైద్య మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

Recommended Video

AP లో త్వరలో తెరుచుకోనున్న Schools - మంత్రి సురేష్ || Oneindia Telugu
 రివర్స్ టెండరింగ్ లో 143 కోట్ల రూపాయల ఆదా

రివర్స్ టెండరింగ్ లో 143 కోట్ల రూపాయల ఆదా

గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్న మంత్రి ప్రస్తుతం పాఠశాలల్లో మెరుగైన పరిస్థితులు కల్పించడం కోసం దృష్టి సారించామని పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి వేగంగా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్న మంత్రి, ఇప్పటివరకు రివర్స్ టెండరింగ్ విధానంలో 143కోట్ల రూపాయలను ఆదా చేసినట్లుగా వెల్లడించారు.

 డిగ్రీ పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదు

డిగ్రీ పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదు

డిగ్రీ పీజీ పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఇప్పటి వరకు ప్రయత్నాలు చేశామని సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్ లర్ లు ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు కూడా తీసుకున్నామని మంత్రి చెప్పారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఇక ఆయన ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

 విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్

విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన మంత్రి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం వరకూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఇక పాఠశాలల్లో విద్యార్థులకు అనుమానాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800123123124 ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే పాఠశాలను తెరవబోతున్నామనీ మంత్రి చెప్పారు.

నాడు నేడు ఫేజ్ 1 పనులు త్వరలో పూర్తి

నాడు నేడు ఫేజ్ 1 పనులు త్వరలో పూర్తి

హెచ్.ఎమ్ లు ఏ సమస్య వచ్చినా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామనీ, మీరు మీ సమస్య చెపితే వెంటనే పరిక్షరిస్తామనీ హామీ ఇచ్చారు. ప్రధానోపాద్యాలకు మేము అండగా ఉంటామనీ అన్నారు.ఇక నాడు నేడు మొదటి ఫేజ్ లో భాగంగా 15,750 స్కూల్స్ ఎంపిక అయ్యాయి. ఇప్పటి వరకు నాడు- నేడు కి సంబంధించి ఫేస్ 1 లో 504 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు మంత్రి చెప్పారు. 710 కోట్లను ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ఏర్పాటు చేశామని పేర్కొన్న మంత్రి,నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ నిధులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు.

మెరుగైన విద్య అందించటమే లక్ష్యం

మెరుగైన విద్య అందించటమే లక్ష్యం


నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి అందరికి తెలిసేలాగా ఆన్లైన్ లో పెట్టామని, జూలై నెలాఖరికి చేప్పట్టిన నాడు- నేడు పనులు స్పష్టంగా కనిపిస్తాయనీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.ఇక విద్యావ్యవస్థలో, విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందించటం కోసం ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ సన్నద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

English summary
AP Education Minister Adirimula Suresh said schools will open soon. Suresh said the decision would be taken based on the guidelines from the Center on Degree and PG exams and said that no decision has been taken yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X