వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబూ ఇది తగునా! : రూ.100కోట్లపై శాస్త్రవేత్తల అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌ శాస్తవ్రేత్తలు ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే వారికి రూ.100 కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై పలువురు శాస్త్రవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే వారికి రూ.100 కోట్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై పలువురు శాస్త్రవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ఇస్కా సదస్సుకు హాజరైన కొందరు శాస్తవ్రేత్తలు, ప్రతినిధులు చంద్రబాబు ప్రకటనపై పెదవి విరుచారు.

ఈ అంశంపై భట్నాగర్ అవార్డు గ్రహీత , ఇక్రిశాట్ శాస్తవ్రేత్త డాక్టర్ రాజీవ్‌ కుమార్‌ వర్షీనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతులు పొందాలంటే కావాల్సింది బహుమతులు కాదని, ముందుగా బాల శాస్తవ్రేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సైన్స్ అచీవర్స్ సమావేశంలో వర్షి ఈ వ్యాఖ్యలు చేశారు.

scientists unhappy on Chandrababu 100 crores gift announcement

పరిశోధనలకు నిధులు ఇవ్వకుండా ఆవిష్కరణలు చేయమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రయోగశాలలు రూపొందించాలన్నారు. ఇలాంటి ప్రణాళికలు రూపొందించి రూ.100 బహుమతి ప్రకటించి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని, ఇప్పటికీ మించిపోయింది లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నోబెల్‌ సాధించాలంటే పరిశోధనలకు అవకాశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా నోబెల్‌ సాధించాలనుకోవడం ఎంతవరకూ సబబని విమర్శించారు. దేశవ్యాప్తంగా పౌష్టికాహార లేమి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమలో అత్యధికంగా సాగు చేయదగిన వేరుశనగ, కంది, జొన్న, సజ్జ తదితర కొత్త వంగడాలను ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ముఖ్యంగా.. అత్యధిక నూనె శాతం, పోషక విలువలు కలిగిన వేరుశనగ వంగడాలను తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

English summary
It is said that few scientists unhappy on AP CM Chandrababu's 100 crores gift announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X