గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!

ఏపీలోని నాలుగు కీలక రైల్వే స్టేషన్లు గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను తాత్కాలికంగా ఈ నెల 23, 24 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ 8 రైళ్లు ఏయే తేదీల్లో ఈ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించడం లేదో, అందుకు గల కారణాలేంటో పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీలోని కాకినాడ పోర్టు-విశాఖపట్నం మధ్య నడిచే 17267 నంబర్ ఎక్స్ ప్రెస్ రైలును మార్చి 24వ తేదీన రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే 17268 రైలును కూడా అదే రోజు రద్దు చేశారు. అలాగే రాజమండ్రి-విశాఖపట్నం మధ్య నడిచే 67285 రైలును ఈ నెల 24న రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం-రాజమండ్రి రైలు నంబర్ 67286 రైలు కూడా అదే రోజు రద్దయింది.

SCR cancels these 8 trains between guntur kakinada Visakhapatnam due to maintenance works

విశాఖపట్నం-గుంటూరు మధ్య నడిచే 22875 నంబర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలును 24వ తేదీన నడిచే రైలు కూడా రద్దయింది. అలాగే గుంటూరు-విశాఖ మధ్య నడిచే 22876 నంబర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా అదే రోజు రద్దయింది. అలాగే గుంటూరు-విశాఖ మధ్య నడిచే 17239 నంబర్ సింహాద్రి ఎక్స్ ప్రెస్, అలాగే విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే 17240 సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈ నెల 23, 24 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

SCR cancels these 8 trains between guntur kakinada Visakhapatnam due to maintenance works

విజయవాడ డివిజన్ పరిధిలోని సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్ల మధ్య జరుగుతున్న ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనులు పూర్తి కాగానే తర్వాత రోజు నుంచి ఈ రైళ్లు తిరిగి యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+