నెల్లూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

నెల్లూరు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నెల్లూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ఓ ప్రత్యేక రైలుకు ఇక్కడ అదనంగా స్టాప్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు రాకపోకల్లో నెల్లూరు స్టేషన్ కు అదనపు స్టాప్ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ప్రయాణికులు ఈ మార్పు గమనించి ఇకపై ఈ ప్రత్యేక రైలుకు నెల్లూరు స్టేషన్ కూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభించింది.

ధన్‌బాద్-కోయంబత్తూర్-ధన్‌బాద్ స్పెషల్ రైళ్లకు (03679/03689) నెల్లూరులో అదనపు స్టాప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైలు నెం. 03679/03680 ధన్‌బాద్-కోయంబత్తూర్-ధన్‌బాద్ స్పెషల్ రైలుకు మార్చి 08, 2025 నుండి నెల్లూరు స్టేషన్‌లో అదనపు స్టాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వాస్తవానికి ఈ ప్రత్యేక రైలుకు నెల్లూరు స్టేషన్ లో స్టాప్ లేదు. కానీ ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.

scr provides additional stop at Nellore for dhanbad-coimbatore-dhanbad special train

దీంతో ఇప్పుడు 03679 నంబర్ ధన్‌బాద్-కోయంబత్తూర్ రైలు 08.03.2025న ధన్‌బాద్ నుండి ప్రారంభమై మార్చి 10న ఉదయం 06:59 గంటలకు నెల్లూరు చేరుకుని ఉదయం 07:00 గంటలకు బయలుదేరుతుంది. అలాగే 03680 నంబర్ కోయంబత్తూర్-ధన్‌బాద్ నంబర్ గల రైలు 11.03.2025న కోయంబత్తూర్ నుండి బయలుదేరి మార్చి 11నే సాయంత్రం 5.49 గంటలకు నెల్లూరు చేరుకుని 5.50 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్ కోసం
నెల్లూరుకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+