శ్రీకాకుళంలో 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీల్లపేటలో శనివారం రాత్రి సముద్రం సుమారు 100 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది. సాధారణంగా తుఫాన్ల వంటి సమయంలో తీరంలో ఎగిసిపడే అలలతో సముద్రం ముందుకొస్తుంది.
ఆ తర్వాత యథాస్థితికి వెళ్తుంది. కానీ ఇప్పుడు తుఫాను ప్రభావం లేకున్నా సముద్రం ముందుకు వచ్చింది. దీంతో, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పైలిన్, హుధుద్ తుఫాను సమయంలో సముద్రం ముందుకు వచ్చినా మళ్లీ వెనక్కి వెళ్లింది.

గత ఐదు రోజులుగా సముద్రం ప్రశాంతంగానే ఉంది. అయినా ముందుకు వచ్చింది. స్థానికంగా ఉన్న జీడితోటల వరకు సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు బోట్లు, వలలను తమ గ్రామ సమీపానికి తరలించారు. బోట్లకు లంగరు వేశారు.
విశాఖలో 50 అడుగుల ముందుకు సముద్రం, పొంచి ఉన్న ముప్పు!
కాగా, ప్రస్తుతం సముద్రం వంద మీటర్ల వరకు రావడాన్ని ఊహించలేకపోతున్నామని, హుధుద్ తర్వాత గ్రామం సముద్రానికి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండేదని, ఇప్పుడు యాభై మీటర్ల దూరానికి వచ్చిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. షెడ్లు కొట్టుకుపోయాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications