మున్సిపల్ పోల్స్ లో పోస్టల్ బ్యాలెట్‌పై SEC కీలక మార్గదర్శకాలు..!!

మున్సిపల్ ఎన్నికల వేళ పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాల ప్రకటన కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. రేపు సుప్రీంలో జరిగే విచారణ కీలకంగా మారుతోంది. ఇక.. పోస్టల్ బ్యాలెట్ పైన ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లలో అభ్యర్థుల పేర్ల ముద్రణకు సంబంధించి పాత నిబంధనలను ఎన్నికల సంఘం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులుగా విభజించింది. పోస్టల్ బ్యాలెట్ ప్యానెల్‌పై అభ్యర్థి పేరు, పార్టీ పేరును మొదట తెలుగులో, కింద ఆంగ్లంలో ముద్రించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా విభజించి నమోదు చేయాలని నిర్దేశించింది.

Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!
Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!
sec-issues-new-guidelines-for-postal-ballot-papers-in-ap-municipal-elections-details-here

ఎన్నికల సంఘం కీలక సూచనలు

పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో ఎన్నికల గుర్తులను ముద్రించకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. సాధారణ బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు ఏ క్రమంలో ఉంటాయో, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అదే క్రమాన్ని పాటించాలి. దీనివల్ల ఓటర్లు అభ్యర్థుల వివరాలను సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థుల పేర్ల కింద తెలుగు, ఆంగ్ల భాషల్లో 'స్వతంత్ర' అని ముద్రించాలని సూచించారు. కాగా.. ఈ సాయంత్రం ఎన్నికల సంఘం అభ్యర్దుల ప్రచారం.. ఎన్నికల వ్యయం పైన పరిశీలకులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్దులు చేస్తున్న ఖర్చు ను పరిశీలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీలు మార్పు చేయటంతో.. జెడ్పీటీసీ... ఎంపీటీసీ ఎన్నికల తేదీలు వాయిదా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+