వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోచారం క్షమాపణకు సభలో డిమాండ్, వద్దని కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసన సభ రెండో రోజు. విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యల పైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని సభాపతి తిరస్కరించారు. అంతకుముందు రైతు ఆత్మహత్యలకు నిరసనగా టీడీపీ మ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేపట్టారు. అనంతరం పది గంటలకు శాసన సభ ప్రారంభమైంది.

శుక్రవారం ఉదయం తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు పలు అంశాల పైన చర్చకు పట్టుబట్టారు. దీని పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందిస్తూ.. అన్ని సమస్యల పైన తాము చర్చకు సిద్ధమని, 40 రోజులైనా చర్చ చేపడతామని, చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ఆందోళనతో సాగదీయవద్దని కేసీఆర్ అన్నారు.

టీడీపీ

టీడీపీ

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు 'రైతు ఆత్మహత్యలు కాదు. సర్కారీ హత్యలే' అంటూ గన్ పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

టీడీపీ

టీడీపీ

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు 'రైతు ఆత్మహత్యలు కాదు. సర్కారీ హత్యలే' అంటూ గన్ పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

టీడీపీ

టీడీపీ

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు 'రైతు ఆత్మహత్యలు కాదు. సర్కారీ హత్యలే' అంటూ గన్ పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న ఎర్రబెల్లి.

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న ఎర్రబెల్లి.

టీడీపీ, కాంగ్రెస్

టీడీపీ, కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చీకటి నుండి తెలంగాణను కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు. వెనుక వైపు టీడీపీ నేత ఎర్రబెల్లి.

టీడీపీ, కాంగ్రెస్

టీడీపీ, కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలతో ఎర్రబెల్లి మాటమాంతి.

కాంగ్రెస్

కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం. నిరసనలో గీతా రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు.

టీడీపీ, కాంగ్రెస్

టీడీపీ, కాంగ్రెస్

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలతో ఎర్రబెల్లి మాటమాంతి.

సభాపతి మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభాపతి సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను పోచారం శ్రీనివాస్ రెడ్డి అవమానపరిచారని మండిపడ్డారు. దీనికి పోచారం క్షమాపణలు చెప్పాలన్నారు. అలాగే పోచారంను బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ వాయిదా అనంతరం మళ్లీ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు.. ఇదే డిమాండ్ చేయడంతో మరోసారి పదినిమిషాలు వాయిదా పడింది.

సభ మొదటిసారి వాయిదా పడిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ మధుసూదనాచారి సమావేశమయ్యారు. సభా సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని నేతలను స్పీకర్ కోరారు. మరోవైపు శాసన మండలిలోని విపక్షాలు అధికార పార్టీని నిలదీశాయి.

English summary
Second day Telangana Assembly sessions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X