ఆ నిబంధనలతో దక్షిణాది రాష్ట్రాలకు రూ. 80 వేల కోట్లు నష్టం: కేరళ మంత్రి థామస్

అమరావతి: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో దక్షిణాది రాష్ట్రాలకే సుమారు రూ.80 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని కేరళ ఆర్ధిక శాఖ మంత్రి థామస్ ఇసాక్ అభిప్రాయపడ్డారు. మే 7వ తేదిన విజయవాడలో వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో జరిగే సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఖరారు చేసేందుకు ఆయన సోమవారం నాడు ఆయన ఏపీ రాష్ట్రంలో పర్యటించారు. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. మే 7వ తేదిన నిర్వహించే ఆర్థిక మంత్రుల సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఖరారు చేశారు.

15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు జరిగే నష్టంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని థామస్ చెప్పారు. 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కూడ నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదన్నారు.

Second meet of Southern States’ FMs in city on May 7: Finance Minister Yanamala Ramakrishnudu

సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న ఈ నిబంధనలపై చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. మే 7వ తేదిన విజయవాడలో జరిగే ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

తమిళనాడు మినహ అన్ని రాష్ట్రాలు తాము చేసిన ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించాయన్నారు. నిధుల్లో వాటాలు తగ్గినా ప్రోత్సాహకాలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+