ఆర్టీసీ బస్సులో సచివాలయ ఉద్యోగి వీరంగం: చంద్రబాబు ప్రభుత్వం పై చిందులు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: సచివాలయంకు నడుపుతున్న బస్సులలో సెక్రటేరియట్ ఎంప్లాయిస్ కు మాత్రమే స్థానం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు సచివాలయ ఉద్యోగులు. సాధారణ మధ్యతరగతి ప్రయాణికులు దిగిమరి సీటు ఇవ్వాలని ప్రయాణికులపై గోడవ చేస్తున్నారు.

గుంటూరు నుండి ఏపీ సచివాలయం వెలగ పూడికి వెళుతున్న ఆర్టీసీ బసు లో పంచాయతీరాజ్ డిపార్టు మెంట్ ఎంప్లాయ్ రత్నకుమారి అనే మహిళ ఓ సాధారణ ప్రయాణీకుని పై గొడవకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వం దరిద్రపు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపడం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి అని ఊగిపోయింది.

Secretariat employee hulchul in Amaravati, Andhra Pradesh.

కండక్టర్ ఇది జండ్స్ సీట్ అని చెప్పినా వినని ఆమె, సచివాలయం ఉద్యోగులమైన మేము వస్తే ఏ సీటు అయినా ఎవ్వరైనా లేచి సీటు ఇవ్వాలని నోటితో చెప్పలేని మాటలతో ప్రయాణికులను దూషించింది.

పైగా, నా క్యాడర్ కలెక్టర్ తో సమానం నేను వస్తే ఎవ్వరైన లేచి సీటు ఇవ్వాలి అంటూ ఆ ప్రయాణీకుని తో గొడవకు దిగింది.మరో అడుగు ముందుకు వేసి రాజధాని ప్రాంత వాసులకు కామన్ సెన్స్ లేదు అంటూ తిట్ట రాని తిట్లు తిట్టింది.లేడిస్ కూర్చునే సీట్లకు ఎండ తగులుతుంది కాబ్బట్టి జండ్స్ లేచి సీట్లు ఇవ్వాలి అని హుకుం జారీ చేసింది.

ఆంధ్రావాళ్లు ఇంత పనికిమాలిన వారు కాబట్టే తెలంగాణ నుండి తరిమేశారు. పనికిమాలిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ తిట్టిపోసింది. సీటు కు అడ్డుపడిన బస్సులోని ప్రయాణికుడిని నేను పంచాయతీ రాజ్ ఎంప్లాయ్ రత్నకుమారి ఏం పీక్కుంటారో... పీక్కొండి అని నానా యాగీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Secretariat employee hulchul in Amaravati, Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి