మహిళా పోలీసును పెళ్లికి నమ్మించి- న్యూడ్ ఫొటోలు సేకరించి-విజయనగరంలో దారుణం
ఏపీలో అత్యాచార ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ వివాహితలు, యువతులపై అత్యాచారాలతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే విజయనగరంలో తాజాగా ఓ మహిళా పోలీసునే న్యూడ్ ఫొటోలు తీసి బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం శృంగవరపు కోటలోని ఓ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న మహిళపై అదే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి న్యూడ్ ఫోటోలు తీశాడు. అంతటితో ఆగకుండా వాటిని ఆమె తండ్రికి పంపాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రియుడే కదా అని సన్నిహితంగా ఉన్న సమయంలో న్యూడ్ ఫొటోలు తీసి చివరికి పెళ్లి చేసుకోమంటే వాటితోనే బెదిరింపులకు పాల్పుడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై సదరు మహిళా పోలీసు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

తనతో సన్నిహితంగా మెలిగిన సమయంలో తీసిన న్యూడ్ ఫొటోల్ని ప్రియురాలి తండ్రికి పంపిన ఆ నీచుడు బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శృంగవరపుకోట మండలం ముసిడిపల్లి సచివాలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా పోలీస్ గా పని చేస్తున్న ప్రేయసి
ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియుడు రెడ్డి నవీన్(23)లను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే కేసు నమోదు చేసి రెడ్డి నవీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications