టీ రగడ: ప్రత్యేక దేశం కోసం టిడిపి సీమాంధ్ర నేతలు

 In Seemandhra, cries for a separate Telugu nation
హైదరాబాద్‌: రాష్ట్ర విభజన వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేకమైన పార్లమెంటు కావాలని తెలుగుదేశం సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యులతో పాటు అర డజను మంది తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆ డిమాండ్‌ను ముందు తెచ్చారు.

పార్లమెంటులో మైక్రోఫోన్‌ను, అద్దాలను పగులగొట్టి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఆత్మహత్యకు యత్నించాడని భావిస్తున్న పారిశ్రామికవేత్త, పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ డిమాండ్ పెడుతున్నారు. తమకు సొంత పార్లమెంటు ఇవ్వాలని, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల మాదిరిగా తమకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

ఆంధ్రులకు గౌరవం లేనప్పుడు తాము దేశంలో ఉండాలా, వద్దా అని ఆలోచించుకునే హక్కు తమకు ఉందని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూటక్కి వేణుగోపాల్ పేర చాలా రోజుల క్రితమే అటువంటి పోస్టర్లు కృష్ణా జిల్లాలోని నూజివీడులో వెలిశాయి.

తాము ఈ దేశంలో ఉన్నామా, లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని, తాము ఈ దేశీయులం కామనే భావనకు గురవుతున్నామని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. స్వయం పాలన కావాలని అడుగుతున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తాము సీమాంధ్రను ప్రత్యేక దేశంగా చేయాలని ఎందుకు అడగకూడదని మరో తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.

ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌లో తప్పు లేదని, ఐరోపా యూనియన్ మాదిరిగా భారతదేశం ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+