కెసిఆర్ నుంచి విముక్తి, టిడిపిలో చేరను: డొక్కా

తెలంగాణను సీమాంధ్రులు దోచుకున్నారని కెసిఆర్ నుంచి ఇక ముందు ఆరోపణలు రాబోవని, అది సీమాంధ్రకు విముక్తి లభించడం లాంటిదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని, తెలుగుదేశం పార్టీలో చేరబోనని ఆయన అన్నారు. గుటూరు జిల్లా తాడికొండ నుంచి మినహా జిల్లాలో మరెక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఏ ముఖంతో పొత్తు
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును కాదని బిజెపితో తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బిజెపి ప్రయత్నించిందని, అలాంటి బిజెపితో తెరాస ఏ ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకుంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
బిజెపితో పొత్తు పెట్టుకుంటే తెరాసకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ మళ్లీ కాంగ్రెసులో చేరిన విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ విధానాలను నమ్మి తాము పనిచేశామని, వివేక్ వంటి వారు కాంగ్రెసుపై నమ్మకం లేక పార్టీని విడిచి వెళ్లారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications