విభజన: రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర నేతల భార్యలు
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల సతీమణులు శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో వారు ప్రణబ్‌ను కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిని రాష్ట్రపతికి వివరించిన వారు.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల సతీమణులు కలిశారు. వీలైతే ఏఐసిసి అధ్యక్షురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఎపి రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలుస్తామని చెప్పారు.
షిండేను కలిసిన సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు అంతకుముందు కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రతాప్ మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రత షిండేకు తెలుసునని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరినట్లు చెప్పారు.

కేబినెట్ నోట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్తామని తమతో షిండే చెప్పారన్నారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చాకనే ముందుకు సాగుతారని తెలిపారు.
రౌతు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు ధీక్షా శిబిరం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. రౌతు దీక్షా శిబిరం వద్ద ఎపిఎన్జీవోలు, న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. కాగా, సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయవాదులు ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఆరా తీశారు. ఎవరు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయలేదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో వారు రౌతు దీక్షా శిబిరం వద్ద ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications