వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీ ఆంధ్రా మాంసాహారం: అంతిష్టమా అని టిడిపి భగ్గు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Seemandrha TDP MLAs fire at Digvijay Singh
హైదరాబాద్: ఆంధ్రా మాంసాహారం తనకు చాలా ఇష్టమని, గురువారం, ఏకాదశి కారణంగా ఆ రెండు రోజులు రుచి చూడలేకపోతున్నానన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులి దిగ్విజయ్ సింగ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు.

సిగ్గు లేకుండా రొయ్యలు, చేపలు ఇష్టమని చెబుతున్నారని, సోనియా, దిగ్విజయ్‌లు ఆంద్రుల మాంసం తింటారా? అది అంత రుచిగా ఉంటుందా? అని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఏమి జరగబోతున్నదో ముందే చెప్పేస్తున్న దిగ్విజయ్‌పై సభా హక్కుల నోటీసు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.

బిల్లుపై చర్చ విషయమై సోమవారం శాసనసభా సలహా సంఘంలో చర్చిస్తారని ముందు చెప్పడం ద్వారా దిగ్విజయ్ సింగ్ అసెంబ్లీని కించపరిచారన్నారు. ఓటింగ్ జరగదని, కేవలం అభిప్రాయం మాత్రమేనని దిగ్విజయ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా రాష్ట్రపతా అన్నారు.

అసెంబ్లీ నడిపే అధికారం సభాపతికి మాత్రమే ఉంటుందని, తాము కోరినట్లయితే ఓటింగ్ జరపాల్సి ఉంటుందన్నారు. దిగ్విజయ్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధి కాదని, కేవలం ఓడిపోయిన నేత అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆయనను ప్రజలను నెట్టి వేశారని, ఆంధ్రప్రదేశ్‌కు హిరణ్యకశిపుడిలా దాపురించారన్నారు.

రాష్ట్ర విభజన కోసం వచ్చిన వేర్పాటువాదికి (దిగ్విజయ్) ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎలా విందునిచ్చారు.. ఆ విందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ విందుకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

English summary
Seemandhra Telugudesam Party leaders on Saturday fired at AP congress Party incharge Digvijay Singh for his statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X