ఆనం డిసైడ్ అయిపోయారా - అసలు లక్ష్యం ఇదే : ఇక, సీఎం నిర్ణయమే పెండింగ్..!!

ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం అధికార పార్టీలో వేడి పెంచుతోంది. రాజంపేట..అన్నమయ్య..హిందూపురం జిల్లాల విషయంలో వివాదాలు కొనసాగుతండగా..ఇప్పుడు నెల్లూరు జిలాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అందునా సీనియర్ పొలిటీషియన్ .. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు.

ఆనం అసలు లక్ష్యం ఏంటి

ఆనం అసలు లక్ష్యం ఏంటి

2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెల్లూరు వైసీపీలో ఈ మధ్య కాలంలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని సరి చేసేందుకు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రితో పాటుగా జిల్లా మంత్రులు... పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల నెల్లూరులో సమావేశం నిర్వహించారు. కానీ, పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. తాజాగా.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆనం దీక్షకు దిగారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాపూరు మండలం కోసమేనా

రాపూరు మండలం కోసమేనా

నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు మండలాన్ని శ్రీబాలాజీ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఆయన ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. కండలేరు జలాశయం కోసం తాను పది రోజులు నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరులో ఉంచకుంటే అలాంటి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. రాపూరుతో తమ కుటుంబానికి ఆరు దశాబ్దాల అనుబంధం ఉందని ఆనం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. అయితే, ఆనంకు మద్దతుగా.. వ్యతిరేకంగా జిల్లా వైసీపీ నేతలు ఎవరూ స్పందించటం లేదు. ఆనంను అడ్డుకొనేందుకు పార్టీ అధినాయకత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది. ఆనం అధికారులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నా.. పరోక్షంగా ప్రభుత్వమే ఆయన టార్గెట్ అనేది అర్దం అవుతోంది.

నెల్లూరు వైసీపీలో కలకలం

నెల్లూరు వైసీపీలో కలకలం

సీనియర్ ఎమ్మెల్యేగా ఆనం కేబినెట్ లో అవకాశం దక్కుతుందని ఆశించారు. కానీ, త్వరలో జరిగే విస్తరణలోనూ తనకు అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా నెల్లూరు వైసీపీలో చర్చ సాగుతోంది. దీంతో పాటుగా తన కంటే జూనియర్లు పార్టీలో... జిల్లాలో పెత్తనం చేయటం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం నుంచి అభ్యంతరం ఉంటే .. సీఎంను కలిసి చెప్పుకోవాల్సిందని..కానీ, నిరసనలకు దిగటం ద్వారా ఆయన ఇక రెబల్ గా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారు

సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారు

ఆనం చేస్తున్న వ్యాఖ్యల పైన ఎవరూ వ్యతిరేకంగా స్పందించవద్దంటూ పార్టీ నాయకత్వం నుంచి జిల్లా వైసీపీ నేతలకు సందేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న వేళ... జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది, అదే సమయంలో జిల్లాల ఏర్పాటు పైన అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చని..కానీ, అధికార పార్టీ నేతలే నిరసనలకు దిగటం.. ఓపెన్ గా విమర్శలు చేయటం మాత్రం పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో...ఇప్పుడు ఆనం విషయంలో జగన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+