ఎలా విభజిస్తారు: జగన్, మేం వ్యతిరేకమే: ఏచూరి

 Seetharam Yechuri and Ys Jagan
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సిపిఎం నేతల నుంచి మద్దతు లభించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీ మద్దతు కూడగట్టే క్రమంలో భాగంగా జగన్ శనివారం సిపిఎం నేతలను కలిశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఎలా విడగొడుతారని జగన్ సిపిఎం నేతలతో భేటీ తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

మెజారిటీ అభిప్రాయాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన అడిగారు. విభజన తీర్మానం శాసనసభకు వచ్చే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడాన్ని తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి మీడియాతో చెప్పారు. జగన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంపై జనగ్ తమతో చర్చించారని, ఒక్కసారి విభజించడం ప్రారంభిస్తే తేనెతుట్టెను కదపడం వంటిదేనని ఆయన అన్నారు.

అనేక ఉద్యమాలు, త్యాగాల తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్ద కాలంపాటు ఈ ఉద్యమాలు జరిగాయని ఆయన అన్నారు. మళ్లీ రాష్ట్రాలను విడగొడితే సమస్యలు వస్తాయని ఏచూరి అన్నారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్, ఆంధ్ర శాసనసభలు తీర్మానాలను ఆమోదించాయని, రెండింట మూడొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇలాంటి విధానంలోనే అసెంబ్లీ తీర్మానం ఆమోదించాలని ఆయన అన్నారు.

అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా విభజన తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్‌తో ఎన్నికల పొత్తుపై నిర్ణయానికి రాలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+