Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ బీజేపీకి బిగ్ షాక్:కూటమి పాలనపై సింగారెడ్డి ఫైర్-పార్టీకి రాజీనామా..!

ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలిందిజ రాష్ట్ర బీజేపీలో చురుగ్గా పనిచేసిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కమలం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు.పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ పదవికి సింగారెడ్డి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి బాగా లేదని ఆయన ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనలో ఏపీ నడుస్తోందని మండిపడ్డారు. ఏ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. చివరకు కమ్యూనిస్టులు కూడా తమ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అన్నారు.

అత్యంత పేద రాష్ట్రంగా ఏపీ
తాను ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నట్లు చెప్పిన సింగారెడ్డి... ఒక మంచి పని చేయాలంటే పలువురు వ్యక్తులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలో ఏ పార్టీలో లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నాయకులు అధిష్టానాలకు బానిసలుగా ఉన్నారని రాష్ట్ర పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా వివరించలేకపోతున్నారని మండిపడ్డ ఆయన... తాను అధిష్టానం దృష్టికి సమస్యలు తీసుకెళ్దామనుకుంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఇక్కడితో సరిచేయకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా మిగిలిపోతుందని సింగారెడ్డి జోస్యం చెప్పారు.

senior-bjp-leader-singareddy-resigns-alleges-family-rule-lack-of-internal-democracy-in-ap

కూటమి పాలనపై సింగారెడ్డి ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలనను అటకెక్కించిందని.. ఎవరి గేమ్ వారు ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకరేమో తిరిగి అధికారంలోకి రావాలని లేదంటే తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో పనిచేస్తుంటే మరొకరు తాను ముఖ్యమంత్రి కావాలని పనిచేస్తున్నారని పరోక్షంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అన్నారు. అభివృద్ధి విషయం పక్కన పెడితే, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రైతులకు అండగా నిలబడదామనే సోయ లేకుండా పోయిందని కూటమి ప్రభుత్వం పై సింగారెడ్డి మండిపడ్డారు.

ఏపీ బీజేపీలో లోపించిన అంతర్గత ప్రజాస్వామ్యం
జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రాంతీయ పార్టీలకు సలాం కొట్టే పరిస్థితి వచ్చిందని, ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లు ఇస్తామంటే అన్ని సీట్లకే తల ఊపుతోందని నిప్పులు చెరిగిన సింగారెడ్డి.. బీజేపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. అంతేకాదు ఏపీ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని అన్నారు.ఒకసారి పొత్తు, మరోసారి పొత్తుకు దూరం,తాజాగా 2024లో మళ్లీ పొత్తు, 2029లో అసలు పార్టీ ఉంటుందో లేదో అన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదంటే ఇందుకు కారణం రెండు ప్రాంతీయ పార్టీలే అని మండిపడ్డారు. ఒకరి హయాంలో పెట్టుబడులు వస్తే మరొకరు ప్రభుత్వంలోకి వస్తే రద్దు చేస్తారేమో అన్న భయం ఇన్వెస్టర్లు,కంపెనీ యాజమాన్యాల్లో నెలకొన్నాయని సింగారెడ్డి చెప్పుకొచ్చారు.

రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోన్న వ్యాపారస్తులు
2012లో తాను పసుపు బోర్డు ఏర్పాటుపై గళమెత్తినట్లు చెప్పిన సింగారెడ్డి.. దాని ఫలితమే నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు. అలాగే మామిడి రైతు కూడా మాంగో బోర్డు వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నాడని చెప్పిన సింగారెడ్డి... మామిడి రైతుకు గిట్టుబాటు ధర లేక మామిడి పండ్లను రోడ్లపై పారేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇందుకు కారణం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే అన్నారు. రాజకీయాల్లోకి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ప్రవేశిస్తున్నారని ఇది ప్రమాదకరంగా మారుతోందని అన్నారు. కొందరు బీజేపీ నాయకులు మరొక పార్టీతో చేతులు కలిపి వారి వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నారే తప్ప వారికి ప్రజాసమస్యలు, విద్యార్థుల సమస్యలు, రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగం లేక పక్కదోవ పడుతున్నారని అన్నారు.మొత్తం మీద రాజకీయాల్లో మార్పు అవసరం అని సింగారెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మొదట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపించింది. అయితే కొన్ని సమీకరణాలతో ఆ పదవి మాధవ్‌కు దక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+